హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెఎఫ్‌సి మీటింగ్: ఎంపీల రాజీనామాలతో నష్టం, బాబు, జగన్ ఇలా చేస్తే మోడీ ఢమాల్: ఉండవల్లి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీని మెడలు వంచేందుకు ఇదే సరైన సమయమని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఎంపీలు రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ రాష్ట్రానికి ప్రయోజనం కల్గించేలా కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ఏపీలోని టిడిపి, వైసీపీల ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వాంపై అవిశ్వాసం పెడితే కుప్పకూలే ప్రమాదం ఉందని కూడ ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏపీకి ఇచ్చిన హమీల్లో కొన్ని హమీలు నెరవేర్చే అవకాశం కూడ లేనివి కూడ ఉన్నాయన్నారు.

Recommended Video

Pawan Kalyan's JFC Meeting With Jayaprakash & Undavalli

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జెఎఫ్‌సి సమావేశం తొలి మీటింగ్ హైద్రాబాద్‌లో ఫిబ్రవరి 16న, ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో వైసీపీ, టిడిపి ప్రతినిధులు మినహ ఏపీకి చెందిన అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు హజరయ్యారు.

ఏపీకి న్యాయం జరిగేందుకు ఏం చేయాలనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణను కూడ సిద్దం చేయననున్నారు. అయితే జెఎప్‌సి సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

ఎంపీలు రాజీనామాలు చేస్తే నష్టం

ఎంపీలు రాజీనామాలు చేస్తే నష్టం

ఏపీకి న్యాయం జరగాలంటే పార్లమెంట్‌లో ఎంపీలు పోరాటం చేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు ఎంపీలు రాజీనామాలు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు పార్లమెంట్‌లో ఏపీ రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న 25 మంది ఎంపీలు తమ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. రాజీనామాలు చేస్తే ఫలితం ఉండదన్నారు. ప్రజలు కూడ ఎంపీలు రాజీనామాలు చేయాలని కోరుతుంటారని ఆయన గుర్తు చేశారు.

జెఎఫ్‌సి మీటింగ్: మాతో పనిచేసేందుకు ఎందరో: పవన్, ట్విస్టిచ్చిన వైసీపీ నేత తోట చంద్రశేఖర్జెఎఫ్‌సి మీటింగ్: మాతో పనిచేసేందుకు ఎందరో: పవన్, ట్విస్టిచ్చిన వైసీపీ నేత తోట చంద్రశేఖర్

అవిశ్వాసం పెడితే మోడీ ప్రభుత్వం కుప్పకూలుతోంది

అవిశ్వాసం పెడితే మోడీ ప్రభుత్వం కుప్పకూలుతోంది

కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఎంపీల మద్దతు లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు.శివసేన ఇప్పటికే బిజెపికి మద్దతును ఉపసంహరించుకొందన్నారు. రాజస్థాన్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు విజయం సాషధించారని ఉండవల్లి చెప్పారు. ఏపీకి చెందిన టిడిపి, వైసీపీ ఎంపీలు కూడ బిజెపికి మద్దతుగా ఉన్నారని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సమయమన్నారు.

జెఎఫ్‌సి మీటింగ్: మాపై ఎక్కువ ఆశలొద్దు, ఆకాశానికెత్తి పడేయొద్దు: జెపి ఆసక్తికరంజెఎఫ్‌సి మీటింగ్: మాపై ఎక్కువ ఆశలొద్దు, ఆకాశానికెత్తి పడేయొద్దు: జెపి ఆసక్తికరం

నష్టం చేయడంలో ఇద్దరి తప్పులున్నాయి

నష్టం చేయడంలో ఇద్దరి తప్పులున్నాయి

ఏపీ రాష్ట్రానికి తప్పులు జరిగాయని, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో కొన్ని హమీలను నెరవేర్చే పరిస్థితే లేదన్నారు. కొన్నింటిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.అయితే జెఎప్‌సి సమావేశం తర్వాత జరిగిన విషయాలపై ఏపీలోని రెండు ప్రధాన పార్టీలను ఏపీకి న్యాయం చేయాలని పోరాటం చేయాలని ఒత్తిడి చేయాలన్నారు. లేకపోతే ఈ రెండు పార్టీల తీరును ఎండగడతామని చెప్పాలన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

జగన్‌ ఎఫెక్ట్‌: గందరగోళంలో టిడిపి, అందుకే 'ఆది'ని నిలువరించారా?జగన్‌ ఎఫెక్ట్‌: గందరగోళంలో టిడిపి, అందుకే 'ఆది'ని నిలువరించారా?

రాజకీయాలతో ముడిపడి ఉంది

రాజకీయాలతో ముడిపడి ఉంది

రాజకీయాలతోనే ప్రతి విషయం ముడి పడి ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాలకు అతీతంగా పోరాటమనేది సాధ్యం కాదన్నారు. జెఎఫ్‌సి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పోరాటాన్ని నిలిపివేయకూడదని ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ కు సూచించారు. పోరాటాన్ని కొనసాగించాలన్నారు. జెఎఫ్‌సి సమావేశానికి హజరైన వారిలో చాలా మంది ప్రముఖులున్నారని ఉండవల్లి గుర్తు చేశారు.

English summary
Jana Sena Chief Pawan Kalyan has conducted a meeting with members of Joint Fact-Finding Committee on Friday. Former Congress MP Undavalli Aruna Kumar while speaking on the occasion has raised the basic points pertaining to the AP Re-Organisation Act of 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X