ఆ వైసీపీ మాజీ ఎంపీ కేంద్రమంత్రి కాబోతున్నారా ? నెల్లూరు టాక్..!
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన భాగస్వాములుగా ఉన్న కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల్లో టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్రంలో అయితే మూడు పార్టీలూ అధికారం పంచుకుంటున్నాయి. అయితే కేంద్రంలో మాత్రం జనసేన ఎంపీకి మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో గతంలో వైఎస్సార్సీపీలో పనిచేసి, ఆ తర్వాత టీడీపీలో చేరిన ఓ కీలక నేతకు మాత్రం త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో బెర్తు దక్కబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
గతంలో వైఎస్సార్సీపీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత లోక్ సభకు వైఎస్సార్సీపీ టికెట్ కూడా తెచ్చుకున్నారు. కానీ అసెంబ్లీ టికెట్ల విషయంలో అధినేత జగన్ తో విభేదాలు తలెత్తడంతో వైఎస్సార్సీపీకి, లోక్ సభ టికెట్ కు కూడా గుడ్ బై చెప్పేసి భార్య ప్రశాంతి రెడ్డితో కలిసి టీడీపీలో చేరిపోయారు. అనంతరం టీడీపీ ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చింది. భార్య ప్రశాంతి రెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించింది.

ఇప్పుడు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కేంద్రమంత్రిని కూడా చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో రాష్ట్రం నుంచి మూడో కేంద్రమంత్రిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నట్లు నెల్లూరులో ప్రచారం ఊపందుకుంది. వేమిరెడ్డిని నేరుగా కేబినెట్ లోకి తీసుకునేందుకు ప్రధాని మోడీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే ఇప్పటికే తాజాగా చోటు చేసుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటుున్న పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడిని తప్పించి ఆయన స్ధానంలో వేమిరెడ్డిని తీసుకుంటారా అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications