పిఠాపురం ప్లాన్ తెలుసు కదా వర్మా

Chandrababu: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి వలసల సెగ తాకుతోంది. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి మహాకూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీల్లో సీట్ల పంపకాల వ్యవహారం చిచ్చు పెట్టింది.

పొత్తులో భాగంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు వదలుకోవడం వల్ల ఏ స్థాయిలో నిరసన జ్వాలలు చెలరేగుతోన్నాయనేది తెలిసిందే. తెలుగుదేశం పార్టీ టికెట్‌ను ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యేే ఎస్‌వీఎస్ఎన్ వర్మ, ఆయన అనుచరులు వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.

Former Pithapuram MLA SVSN Varma meets Chandrababu Naidu

ఈ సెగ కాస్త చంద్రబాబునూ తాకింది. దీనిపై ఆయన దృష్టి పెట్టారు. పిఠాపురంలో పరిస్థితులు చక్కబెట్టడానికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పిఠాపురంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి ఆయన తక్షణ చర్యలు తీసుకున్నారు.

అసమ్మతి చిచ్చు రాజేసిన ఎస్‌వీఎస్ఎన్ వర్మకు ఫోన్ చేశారు. తనను కలవాల్సిందిగా ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఆయన ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. పిఠాపురం పరిస్థితులు, తన అనుచరులు, అభిమానుల మనోగతాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Former Pithapuram MLA SVSN Varma meets Chandrababu Naidu

ఈ సందర్భంగా వర్మ పెట్టిన డిమాండ్లన్నింటి పట్లా చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాసన మండలికి పంపిస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చిన తరువాతే ఆయన మెత్తబడినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కీలక పదవి సైతం ఇస్తానంటూ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. పిఠాపురం సమస్యలన్నింటినీ పరిష్కరించానని అన్నారు. పిఠాపురం ఓటర్లు అందరూ పవన్ కల్యాణ్‌ను రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి కూటమి వైపు నిలవాలని అన్నారు.

పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను పని చేస్తానని ఎస్‌వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఓ తాలిబన్‌లో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని వ్యాఖ్యానించారు. తనకు టికెట్ దక్కకపోవడం పట్ల అనుచరుల్లో కొంత నిరాశ నిస్పృహ ఉందని అంగీకరించారు. వారికి తాను నచ్చజెబుతానని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+