జగన్ పై నిప్పులు చెరిగిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే, తాజా అభ్యర్ధి..! అంతా మీ వల్లే..

ఏపీలో వైసీపీ ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గొంతు సవరించుకుంటున్నారు. వైసీపీ ఓటమి వెనుక కారణాలపై క్రమంగా నోరువిప్పుతున్నారు. ఇదే క్రమంలో తిరువూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలి గడ్డ రక్షణ నిధితో పాటు ఆయనకు బదులుగా జగన్ పోటీ చేయించిన నల్లగట్ల స్వామిదాస్ కూడా ఓటమిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జగన్ తో పాటు ఐప్యాక్, ఆరా మస్తాన్, సలహాదారులు ఇలా అందరిపైనా విరుచుకుపడ్డారు.

తిరువూరులో తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగానూ, విపక్షంలోనూ పనిచేశానని, జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆరోపించారు. జగన్ బటన్ నొక్కుడు తప్ప రాష్టానికి చేసింది శూన్యమన్నారు. జగన్ వల్ల తాను తిరువూరు నియోజక వర్గ అభివృద్ధి చేయలేకపోయానన్నారు. వైసీపీ దారుణంగా ఓడిపోయిందని, కూటమిని కలిపిన దమ్మున్న మొనగాడు పవన్ కళ్యాణ్ అని రక్షణ నిధి పేర్కొన్నారు.

former tiruvur mla rakshana nidhi and mla candidate swamy das slams ys jagan for poll debacle

తిరువూరు వచ్చి జగన్ ఇచ్చిన హామీలు నీట మునిగాయని రక్షణ నిధి ఆరోపించారు. 2023 డిసెంబర్ నుంచి వైసీపీకి దూరంగా వున్నట్లు ఆయన తెలిపారు. ఐ ప్యాక్, సలహదారులను నమ్మి నట్టేట మునిగావు జగన్ అని రక్షణ నిధి విమర్శించారు.
ప్రజల మధ్య తిరిగింది మేము.కనీసం మమ్మల్ని అడిగావా జగన్ అని ప్రశ్నించారు. నీ వల్ల రాష్టానికి ఒరిగింది ఏమి లేదు,
కనీసం ఎప్పుడైనా ఎమ్మెల్యేలను గుర్తించావా జగన్ అన్నారు.

తిరువూరులో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్ది కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తాను కూటమికి మద్దతుగా ప్రచారం చేసానని, కాలమే తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రక్షణ నిధి తెలిపారు. మరోవైపు తిరువూరులో వైసీపీ తరపున పోటీ చేసిన నల్లగట్ల స్వామిదాస్ సైతం పార్టీ, జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఆర్ధికంగా దెబ్బతిన్నామని, కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన తెలిపారు. ఐప్యాడ్ టీం మోసం చేసారని ఆరోపించారు. ఆరా మస్తాన్ అడ్డంగా ముంచేశాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+