సైకిల్ తొక్కిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.. రీజన్ ఇదే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా రాజకీయాలు హాట్ గా మారాయి. అప్పుడే ఏపీలో ఎన్నికల హడావిడి కనిపిస్తున్నట్టుగా ఉంది. ఏపీలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళుతూ పోరాటాలు చేస్తుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, పెద్దఎత్తున ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది.

ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రంగంలోకి దిగి ప్రస్తుతం నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత తీవ్ర మనస్థాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. సభలలో ప్రసంగిస్తూ టీడీపీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. ప్రజల మద్దతు చంద్రబాబు కోసం కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Former Union Minister Ashok Gajapathi Raju rides bicycle.. tdp tweets video!!

ఇదిలా ఉంటే నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సైకిల్ ఆగేది లేదని తేల్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి తన మద్దతును ప్రకటించారు.

72 ఏళ్ల వయసులో కూడా ఆయన సైకిల్ తొక్కుతూ తెలుగు దేశం పార్టీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ పట్ల తనకున్న విధేయతను స్పష్టం చేశారు అశోక్ గజపతిరాజు. ఇక తెలుగుదేశం పార్టీ ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అశోక్ గజపతిరాజుకు తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న విధేయతను స్పష్టం చేసింది.

రాజకీయాలంటే విధేయత, నిగర్వం, నిజాయతీ అని నమ్మిన రాచబిడ్డ అశోక్ గజపతిరాజు అని టీడీపీ పేర్కొంది. చంద్రబాబు కోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాన్ని, చంద్రబాబు కోసం అభిమానులు పడుతున్న ఆరాటాన్ని సోషల్ మీడియా వేదికగా చూపించే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+