వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం సవాల్ వాయిదా-రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం వల్లేనట..

ఏపీలో రాజకీయమంతా ఓ ఎత్తయితే ఉత్తరాంధ్ర రాజకీయాలు మరో ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ కూడా మిగతా ప్రాంతాల్లాగే పార్టీ రాజకీయాలు కొనసాగుతున్నా.. వ్యక్దిగత, కుటుంబ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో రాజకీయాలు జనానికి విసుగుపుట్టిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం టీడీపీలో ఉన్న తన మామ చేసిన ఆరోపణల్ని నిరూపించమంటూ చర్చకు రావాలంటూ వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం విసిరిన సవాలే..

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు వరుసకు కోడలయ్యే వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై స్దానికంగా అవినీతి ఆరోపణలు చేశారు. తన అక్రమ సంపాదన ఐదు వందల కోట్లు పై మాటేనని తన మామ, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చేసిన విమర్శ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ తనతో చర్చకు రావాలని గతంలో పుష్పశ్రీవాణి సవాల్ చేశారు. అయితే ఇవాళ్టి వరకూ మౌనంగా ఉన్న ఆమె.. ఇవాళ మాత్రం తన సవాల్ ను వాయిదా వేసుకున్నారు.

former ysrcp deputy cm pushpa srivani postponed her challenge on corruption allegations

సొంత మామా, మరదలు శత్రుచర్ల పావనిపై సవాల్ ను వాయిదా వేసుకున్నట్లు వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రకటించారు. తాను ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆస్తులు బినామీల పేర మార్చుకోవటానికే తమ మరదలు ఈ వాయిదాల కపట నాటకం ఆదుతోందని పుష్పశ్రీవాణిపై శత్రుచర్ల పల్లవిరాజు ఆరోపించారు. వైసీపీ తన ప్లీనరీలో ప్రకటించిన తేదీకి కురుపాం టీడీపీ సిద్ధంగా వుందని ఆమె తెలిపారు. దమ్ముంటే అనుకున్న తేదీకి చర్చకు రావాలని శత్రుచర్ల పల్లవి సూచించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+