వేమిరెడ్జీ ఉసురుపోసుకోవద్దు.. నెల్లూరులో మైన్ల మూసివేతపై వైసీపీ అనిల్ ఫైర్.. !
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఓ రేంజ్ లో హవా కొనసాగించిన నెల్లూరు నేత అనిల్ కుమార్ యాదవ్.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన పారిపోయారని, ఇతర పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారాలు కూడా సాగాయి. వీటిపై ఇవాళ ఆయన నెల్లూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. 10 నెలలు కుటుంబ వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ పేరు చెప్పి భారీ ఎత్తున ప్రభుత్వం గనుల్ని మూయించివేయడాన్ని అనిల్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. నెల్లూరు జిల్లాలో ఈ ప్రభుత్వం రాకముందే అక్రమ మైనింగ్ పై 255 కోట్ల మేర జరిమానా విధించారు. దాన్ని ప్రభుత్వం వసూలు చేసుకోవడంలో తప్పులేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ ఆపేసి తనిఖీలు చేశారని, రిపోర్ట్ వచ్చాక గనులు తెరిచారా అని ప్రశ్నించారు.

పెనాల్టీ లేనివి తెరవకుండా పెనాల్టీ ఉన్న మైన్లను ఓపెన్ చేశారని అనిల్ ఆరోపించారు. జిల్లాలో యాక్టివ్ మైన్స్ 100 ఉన్నాయని, వీటిని ఎందుకు ఓపెన్ చేయకుండా ఎంపిక చేసిన 30 మాత్రమే ఓపెన్ చేశారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ప్రభుత్వానికి జిల్లా నుంచి 150 కోట్లు వస్తే ఇప్పుడు 30-40 కోట్లు మాత్రమే వస్తున్నాయని గుర్తుచేశారు. మైన్లు మూసివేత వల్ల 10 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
మైన్లు తెరవారని ఓనర్లు కోర్టుకెళ్లారని, ఫిబ్రవరి 10 కల్లా చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినా వినకపోవడంతో కోర్టు ధిక్కార పిటిషన్లు వేశారని అనిల్ గుర్తుచేశారు. మైన్లు తెరవకపోవడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఫెమీ ప్రభుత్వానికి లేక రాసిందని అనిల్ తెలిపారు. ఎంపీ వేమిరెడ్డికి సంబంధించిన ఇద్దరు మాత్రమే ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గనుల పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది నష్టపోతున్నారని ఆరోపించారు. వారి ఉసురుపోవద్దని ప్రభుత్వానికి సూచించారు. జిల్లాలో గనుల మైనింగ్ కు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై ఆధారాల్ని ఆయన బయటపెట్టారు.












Click it and Unblock the Notifications