మాధవ్ ఎపిసోడ్ వెనుక ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య-కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇది రియల్ వీడియో కాదంటున్నారు. దీనిపై టీడీపీ ఇవాళ అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసింది. దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని దీనిపై ఇవాళ మరోసారి స్పందించారు. ఇప్పటికే ఓసారి ఈ వీడియోపై స్పందించిన కొడాలి.. ఇవాళ గుడివాడలో మరోసారి టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. టీడీపీ నేతలకు దమ్ముంటే మాధవ్ అసలు వీడియో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ వీడియో వెనుక ఏముందో కూడా ఆయన బయటపెట్టారు.

Recommended Video

తాజాగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ విమర్శలు చేసింది. దీనిపై జనం నుంచి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు దీనిపైనా స్పందించిన కొడాలి నాని.. ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యను డైవర్ట్ చేయడానికి ఎంపీ మాధవ్ మార్ఫింగ్ వీడియోను టీడీపీ ప్రచారంలోకి తెచ్చిందని ఆరోపించారు. వైసీపీ తల, టీడీపీ బాడీతో ఎడిటింగ్ చేసిన వీడియోను రికార్డు చేసి, దాన్ని అమెరికాలోని ల్యాబ్‌కు పంపితే లాభమేంటని కొడాలి ప్రశ్నించారు. ఐ టీడీపీ, లోకేష్, చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఎంపీ మాధవ్ వీడియోను ఎడిట్ చేశారని కొడాలి ఆరోపించారు. సీఎం జగన్ కు జాతీయ జెండా ఎగురవేసే అర్హత లేదని టీడీపీ నేతల వ్యాఖ్యలపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. అల్లూరి, సుభాష్ చంద్రబోస్‌లాగా వ్యవస్థలపై జగన్ ఒక్కడే పోరాడుతున్నారని చెప్పారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications