Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు టైంలోనే జై తెలంగాణ -వైఎస్ కూ, జగన్ కూ సంబంధమేంటి-పవన్ కు పేర్ని ప్రశ్న..

వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడి, ప్రజలను రెచ్చగొడుతున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ పై బురద వేయటం, చంద్రబాబుకు మేలు జరగాలని చూడటం అలవాటైపోయిందన్నారు. రాజకీయాల్లో ఇంతకన్నా తప్పుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జై తెలంగాణ నినాదం మొదలైందని, 2001లో టిఆర్ఎస్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. కేసీఆర్ పార్టీ పెట్టి జై తెలంగాణ నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టారన్నారు.

వైఎస్ 2004లో ముఖ్యమంత్రి అయితే, దానికీ జగన్ గారికి ఏమిటి సంబంధమని పవన్ ను పేర్ని ప్రశ్నించారు. జనం నవ్వుకుంటున్నారన్న కనీస ఆలోచన కూడా లేకుండా పచ్చి అబద్ధాలు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడన్నారు. పైగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కలిసే టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసిందని, మిగతా పార్టీలు కూడా కలిసి పోటీ చేశాయని గుర్తుచేశారు.
2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీచేసింది నువ్వు , మీ అన్నయ్యే కాదా అని పేర్ని ప్రశ్నించారు.

perni

రాష్ట్ర విభజన గురించి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని పేర్ని విమర్శించారు. వైఎస్ వల్లే విభజన జరిగినట్టు మాట్లాడటం విడ్డూరమన్నారు. 1962-63లలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగిందని, మరి, ఆ ఉద్యమం రావడానికి అప్పుడెవరు బాధ్యులు పవన్ కల్యాణ్ అని అడిగారు. పవన్ కళ్యాణ్ కు కనీసం ఈ మాత్రం విచక్షణ కూడా లేదన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బోలెడన్ని ఆస్తులు కొంటున్నాడు కదా, అతనూ కూడా విభజనకు కారణమే కదా అని అడిగారు.

చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ కిరాయికి ఒప్పుకున్నాడని, కూలీ తీసుకుంటున్నాడని పేర్ని విమర్శించారు. కూలీకి తగ్గట్టుగా పనిచేయడమే పవన్ కు తెలుసు తప్ప వాస్తవాలు, విచక్షణతో పని లేదన్నారు. ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ మీద ఉద్ధేశపూర్వకంగా విషం చిమ్మడం, అసత్యాలు మాట్లాడటం తప్ప, ఆయన మాటల్లో వాస్తవాలేమున్నాయ్ అని అడిగారు.
జగన్ మీద పవన్ కు విపరీతమైన ద్వేషం, కక్ష ఉందన్నారు. చంద్రబాబు దగ్గర ఒప్పుకున్న ప్యాకేజీ కోసం తప్పితే... పవన్ మాటలకు విలువ ఎక్కడిదన్నారు. ఇకనైనా, విషం చిమ్మే కార్యక్రమాలు కట్టిపెట్టాలన్నారు.

చంద్రబాబు కోసమే పనిచేస్తానని దమ్ముంటే, షమ్ షేర్ గా చెప్పొచ్చు కదా పవన్ కల్యాణ్ అని పేర్ని సవాల్ విసిరారు. తాడిచెట్టు ఎందుకెళ్ళావ్ అంటే దూడ గడ్డికోసం అన్నట్టుగా ఉన్నాయి పవన్ కల్యాణ్ మాటలు అన్నారు. కొద్దిసేపు నేనే ముఖ్యమంత్రి అవుతానంటావ్, మరికొద్దిసేపు నేను ముఖ్యమంత్రిని ఎలా అవుతానని అంటావ్, ఎన్ని సీట్లలో పోటీ చేస్తావ్.. అంటే అది మాత్రం నాకు తెలియదంటావు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా, ప్రజలకు నిజాయితీతో నిజాలు చెప్పాలన్నారు. బీజేపీ , టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పండన్నారు.

తణుకులో నీ పార్టీ అభ్యర్థిని ప్రకటించావ్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను ప్రకటించావు, మరి మిగతావి ఎందుకు ప్రకటించవని పవన్ ను పేర్ని ప్రశ్నించారు. 175 సీట్లలో పోటీ చేస్తున్నావా.. లేదా అని అడిగారు. మీరు ఎంతమంది వచ్చినా మాకు లెక్కలేదు, కానీ మేము అంతా ఒక్కటే అని చెప్పటానికి ఎందుకు భయపడుతున్నారన్నారు. ఎందుకు ముసుగు వేసుకుంటున్నారని నిలదీశారు. ఎన్నికల దాకా ముసుగు వేసుకుని, అప్పుడు కలిసి పోటీ చేయడం, ఎవరికి తెలియని విద్యలు ఇవన్నీ అని అడిగారు. మీ స్కీమ్ ఏంటంటే, 30 చోట్ల చంద్రబాబు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను పెట్టడని, నీవేమో అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తావు, ఆ నియోజకవర్గాలకు వెళ్ళి, ప్రభుత్వంపైన, మాపైన విషం చిమ్ముతావని పేర్ని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ 25-30 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని అందరికీ తెలుసన్నారు. పార్లమెంటుకు ఒక సీటు పోటీ చేసి, నీవు ముఖ్యమంత్రివి అవుతావా అని పేర్ని ప్రశ్నించారు. పెందుర్తిలో మహిళ హత్య జరిగితే ఆ హత్య చేసిన వ్యక్తి, పూర్వం వాలంటీర్ గా పనిచేస్తే.. వాలంటీర్ వ్యవస్థకు హత్యకు ఏమిటి సంబంధం అని అడిగారు. అలా అంటే జనసేన, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని హత్యలు, ఎన్ని గంజాయి కేసులు, ఎన్ని మానభంగం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు, వాటన్నింటికీ మీరే కారణమా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు నువ్వు బాధ్యత తీసుకోలేదన్నారు.

నిజాయితీ ఉంటే.. 2014 -19 మధ్య నువ్వు , చంద్రబాబు కలిసి చేసిన పాలనలో మీరు ఏం చేశారో.. మళ్ళీ అదే పరిపాలనను తెస్తాం అని చెప్పే దమ్ముందా అని పేర్ని సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే.. ఆ మాట చెప్పండి. ఆ మాట చెప్పి జనం దగ్గరకు వెళ్ళండన్నారు. అమరావతి రైతుల దగ్గరకు వచ్చి ఏం చేశావు, ఎక్కడికి వెళితే అక్కడ ప్రజల్ని మోసం చేసే మాటలు అన్నారు. సినిమా గ్లామర్ తో ప్రజలను అమ్మేసే మాటలు, పవన్ మాటలు పచ్చిదగాకోరు మాటలు అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారి గురించి లేనివి ఉన్నట్టుగా చెప్పడానికి ప్రధాని మోదీ , అమిత్ షా దగ్గరికి వెళ్తావ్ అని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+