Video: జగన్ సిద్ధం సభకు బస్సు డ్రైవర్ గా వైసీపీ మాజీ మంత్రి..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఇవాళ ఏలూరులో సిద్ధం పేరుతో వైఎస్ జగన్ భారీ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 50 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ క్యాడర్, నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ సభకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సిద్ధం సభకు తమ వంతుగా క్యాడర్ ను భారీ ఎత్తున తరలించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ మాజీ మంత్రి ఏకంగా బస్సు డ్రైవర్ గా మారిపోయారు.
మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ బస్సు డ్రైవర్ గా మారిపోయారు. తన నియోజకవర్గం మచిలీపట్నం నుంచి వైసీపీ సిద్ధం సభకు ఏలూరు వెళ్లేందుకు బయలుదేరిన కార్యకర్తల్ని ఎక్కించుకుని బస్సులో స్వయంగా బయలుదేరారు. బందరుకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఈ బస్సులో ఉన్నారు. ఈ బస్సును పేర్నినాని స్వయంగా నడిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో కార్యకర్తలు కూడా పేర్నికి అనుకూలంగా నినాదాలు చేస్తూ జోష్ ప్రదర్శించారు.

జగన్ సిద్ధం సభకు బస్సు డ్రైవర్ గా వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని#PerniNani #YSJagan #CMJagan #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/vOYezha5xL
— oneindiatelugu (@oneindiatelugu) February 3, 2024
గతంలో బస్సు నడిపిన అనుభవం ఉండటంతో పాటు సిద్ధం సభకు బయలుదేరిన వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకే పేర్ని నాని ఇలా డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి బయలుదేరిన ఈ బస్సు గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వెళ్లి అక్కడి నుంచి దెందులూరు వైఎస్ జగన్ సిద్ధం సభకు కాసేపట్లో చేరుకోనుంది. ఈ సభకు మచిలీపట్నం నుంచి ఇతర బస్సుల్లోనూ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications