వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు బినామీల యాత్ర- ఎన్టీఆర్ ని ఎంత క్షోభపెట్టాడో తెలుసా ? పేర్నినాని సెటైర్లు..

|
Google Oneindia TeluguNews

అమరావతి పాదయాత్ర అనేది టీడీపీ యాత్రని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని, వచ్చే వాళ్ళు కూడా రారని తన బినామీలతో చేయించే యాత్ర ఇది అని పేర్ని విమర్శించారు. రైతులెవరూ ఈ యాత్రలో లేరని కేవలం చంద్రబాబు మనుషులే ఉన్నారన్నారు. టీడీపీ వాళ్ళు కనీసం తమ పార్టీ కండువా కూడా కప్పుకొని స్వాగతం పలికే స్థితిలో లేరన్నారు. పచ్చ కండువా కప్పుకొని పాదయాత్రలో తిరుగుతున్నారని పేర్ని పేర్కొన్నారు.

ప్రజాదరణ లేని టీడీపీ యాత్ర ఖర్చంతా ఎక్కడి నుండి వస్తుందో, వచ్చిన సొమ్ము ఎక్కడ ఉందో లెక్కలు లేకుండా జరుగుతున్న యాత్రని పేర్ని తెలిపారు. చదరపు అడుగులకు వేలు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని భవనాలు నేడు శిథిలావస్థకు చేరాయని, కనీసం రాజధానికి ఒక కారు వెళ్తే మరో కారు రాలేని పరిస్థితన్నారు. ఎవరో అంటున్నారు ఢిల్లీ లో మా అమ్మాయికి అవమానం జరిగిందని మీ రాజధాని ఏదీ అని ..ఎక్కడైనా విమానం ఎక్కితే మీకు రాజధాని లేదు దిగిపో అని అంటున్నారా? ఏం చదువుతున్నావ్, మీ ఊరు ఏంటి అని అడుగుతారు కానీ మీ రాజధాని ఏదని అడుగుతారా.. లేదు కదా..అని పేర్ని వ్యంగాస్త్రాలు సంధించారు.

former ysrcp minister perni nani sensational comments on amaravati padayatra, chandrababu

గతంలో రాబిన్ హుడ్ అనే వ్యక్తి గురించి విన్నాం డబ్బున్నోడిని కొట్టి పేదోడికి పెట్టేవాడిని మరి చంద్రబాబు చేస్తున్నదేంటి..అని పేర్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదోలందరిని కొట్టి అమరావతి లో ఉన్న డబ్బున్నోలకి పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదని, కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొవట్లేదన్నారు. వైస్సార్సీపీ లక్ష్యం ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని, వారి ఆర్థిక స్థితిగతిని మార్చాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఇదే సంకల్పం తో ముందుకు వెళతామన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసలు రాద్దాంతం చేస్తున్న ఈ చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎంత మానసిక క్షోభ అనుభవించాలా చేసాడో తెలుసా అని పేర్ని ప్రశ్నించారు. పార్టీ నుండి సస్పెండ్ చేసి, కనీసం చివరిగా అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడతాను అంటే మార్షల్స్ ను పెట్టి బయటకు గెంటాడన్నారు. మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫోటో లేకుండా చేసాడని, చనిపోయిన తర్వాత మాత్రం దండ వేసి ఎనలేని భయభక్తులు చూపించాడని ఎద్దేవా చేశారు.

English summary
former ysrcp minister perni nani on today made sensational comments on amaravati farmers padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X