వైసీపీకి గుడ్ న్యూస్..కీలక నేతకు బెయిల్
వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల మే 18న ఓ దాడి కేసులో తుళ్లూరు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి, అప్పటి నుంచి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచిన విషయం తెలిసిందే.
ఈ కేసు టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై జరిగిన దాడికి సంబంధించింది. ఈ దాడి ఘటన మే 17, 2025న ఉద్దండరాయునిపాలెంలోని నందిగం సురేష్ ఇంటి వద్ద జరిగింది. దాడి అనంతరం రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేష్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కేసుల్లో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. తుళ్లూరు మండలం వెలగపూడికి ఎస్సీ మహిళ మరియమ్మ వైసీపీ ప్రభుత్వ హాయాంలో పింఛన్ సరిగ్గా రావడం లేదని జగన్ సర్కార్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అప్పటి ఎంపీ నందిగాం సురేష్ అనుచురులు మరియమ్మ ఇంటిపై దాడి చేయగా.. ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 2020లో తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే, వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు చేసిన పలు వ్యవహారాలపై కేసులు నమోదు చేశారు. టీడీసీ కేంద్ర కార్యాలయం పడి దాడి కేసులో నందిగం సురేశ్‌ని అరెస్టు చేశాక ఆయనకి బెయిల్ వచ్చింది. వెంటనే దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌ను మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ బెయిల్ కోసం సురేశ్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉన్న సురేష్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సుప్రీం కోర్టును ఆశ్రయించనా ఊరట దక్కలేదు. చివరకు మంగళగిరి కోర్టు సురేష్‌కు ఈ కేసులో బెయిల్ ఇచ్చింది.మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన ఘటనలో ఈ మాజీ ఎంపీని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ కేసులో కూడా కోర్టు నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
-
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications