అర్ధరాత్రి వరకూ పనిచేసిన లోక్ సభ...! ముచ్చటపడిన సాయిరెడ్డి..!
గత కొన్నేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు అంటే మనకు సాధారణంగా కనిపించేవి విపక్షాల నిరసనలు, కేంద్రం ఎదురుదాడి, వాయిదాల పర్వాలే. కానీ నిన్న మాత్రం అర్ధరాత్రి దాటినా లోక్ సభ పనిచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ పై సుదీర్ఘ చర్చకు కేంద్రం అంగీకరించింది. దీంతో విపక్షాలు కూడా అంతే దీటుగా చర్చ సాగించాయి. కేంద్రం వర్సెస్ విపక్షంగా సాగిన ఈ చర్చ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగింది.
దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వారం రోజుల అంతరాయం తర్వాత నిన్న రాత్రి లోక్‌సభ సజావుగా పనిచేయడం చూసి సంతోషం కలిగిందంటూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్‌షానేతృత్వంలోని పలువురు క్యాబినెట్ మంత్రులు చురుకుగా పాల్గొనడంతో, ఉదయం 12:52 గంటలకు లోక్ సభ వాయిదా పడిందన్నారు. తీవ్రమైన, ఆకర్షణీయమైన చర్చను మొత్తం దేశం నిశితంగా గమనిస్తోందంటూ సాయిరెడ్డి పేర్కొన్నారు.

నిన్న అర్ధరాత్రి వరకూ లోక్ సభ వేదికగా సాగిన ఆపరేషన్ సిందూర్ చర్చను దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా టీవీల్లో చూసారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలకు దిగుతున్న వేళ అధికార పక్షం ఏం సమాధానం చెబుతుందన్న ఆసక్తి వారిలో కనిపించింది.
Heartening to see the Lok Sabha functioning smoothly last night after a week of disruptions. Adjourning at 12:52 AM, with several Cabinet Ministers, led by Hon. Home Minister @AmitShah ji, actively participating. The entire nation was closely following the intense and engaging… pic.twitter.com/HV3FffQ8Ve
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2025
అదే సమయంలో విపక్ష ఎంపీలు ఇన్నాళ్లూ పార్లమెంట్ వెలుపల చేసిన విమర్శల్ని లోక్ సభలోనూ కొనసాగించాయి. దీనికి ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ సమాధానం చెప్పే అవకాశముంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో చర్చను ప్రశంసిస్తూ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications