ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు- అల్పపీడన ప్రభావం- సర్కార్ హెచ్చరికలు..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. అల్పపీడనం కారణంగా ఇప్పటికే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరింత తీవ్రమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగురోజుల్లో భారీ వర్షాలు తప్పవని అధికారులు ప్రకటించారు.
Recommended Video
వాయువ్య బంగాళాఖాతంలో రేపు పూర్తి స్ధాయిలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశముందని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు.

భారీ వర్షాల ప్రభావం రేపటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలపైనా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాయలసీమలో సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదవుతోంది. కోస్తా జిల్లాల్లోనూ ఉత్తరాంధ్ర మినహా మిగిలిన చోట్ల పరిస్ధితి మెరుగ్గానే ఉంది. తాజా వర్షాలతో రైతుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అల్పపీడనం నేపథ్యంలో కోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లతో పాటు ఆర్డీవో కార్యాలయాల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు కలెక్టర్లు సూచిస్తున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications