భారీ పేలుడు.. ఆరుగురు సజీవదహనం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలి పరిధిలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మంటల ధాటికి నలుగురు కార్మికులు అక్కడికక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి హుటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులను నిర్మల, తాతబాబు, గోవింద్‌గా గుర్తించారు. మిగతా వారి వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కోటవురట్ల మండలంలో విషాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు.అటు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications