AP Free Sand: నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక-బుకింగ్ ఇలా..!
ఏపీలో ఉచిత ఇసుక కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉచితంగా ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తారు. ఇందులోనే ఇసుక ఉచితంగా బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. అయితే ఇసుక ఉచితమే అయినా రవాణా ఛార్జీలు మాత్రం చెల్లించక తప్పదు. దీని విధివిధానాలను వెబ్ సైట్లోనే అందుబాటులో ఉంచనున్నారు.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను భారీ రేట్లకు అమ్ముకున్నారు. దీంతో కూటమి సర్కార్ ఆ విధానాన్ని ఎత్తేసి దాని స్ధానంలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ఉచితంగానే కేటాయించారు. ఇప్పుడు ఇసుక ర్యాంప్ ల నుంచి తవ్విన ఇసుకను వినియోగదారులకు అందిస్తారు. ఇలా ఉచితంగా ఇచ్చే ఇసుకను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత ఇసుక కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దీన్ని బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఇవాళ సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పోర్టల్ అవిష్కరించిన తర్వాత బుకింగ్స్ ప్రారంభమవుతాయి. అధికారులు నుంచి ఇసుక రవాణా దారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ పోర్టల్ కు రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
వెబ్ సైట్ లో ఇసుక స్టాక్ ఎంత ఉంది, సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే 2000 చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ పరిధిలోనే ఉంచారు.
2000 చదరపు అడుగులు మించితే మాత్రం బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications