Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సినిమా అవకాశాల పేరుతో స్నేహం ..ప్రాణం తీసిన ఉన్మాదం

సినిమాల్లో అవకాశం ఇస్తారని చేసిన స్నేహం ఒక యువతి ప్రాణం తీసింది. ఒక ఉన్మాది చేతిలో అనవసరంగా బలైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ ఈస్ట్‌లో ఈ దారుణం జరిగింది.

మాట్లాడాలని పిలిచి దారుణంగా యువతిని హతమార్చిన యువకులు

మాట్లాడాలని పిలిచి దారుణంగా యువతిని హతమార్చిన యువకులు

మహిత అనే యువతిని ముగ్గురు యువకులు అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపారు. అసలు కారణం ఏమిటో తెలీదు కానీ అత్యంత కిరాతకంగా ఇంట్లో నుండి మాట్లాడాలని పిలిచి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు . మెడపై, చేతిపై కత్తితో దాడి చెయ్యటంతో మహిత అక్కడికక్కడే మృతి చెందింది.మృతురాలిని భీమవరం మండలం చెరుకువాడ శివారులోని బేతపూడికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.

చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారితో స్నేహమే మహిత ప్రాణం తీసింది

చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారితో స్నేహమే మహిత ప్రాణం తీసింది

అసలు విషయం ఏమిటంటే మహిత తల్లిదండ్రులు జీవనోపాధి కోసం గల్ఫ్ లో ఉంటున్నారు. మహిత కొన్నాళ్లుగా నెక్కంటివాని చెరువులోని మేనమామ గెడ్డం రవి ఇంటి దగ్గర ఉంటూ ఇటీవల ఇంటరు పూర్తి చేసింది. ఆదివారం సాయంత్రం మహిత నెక్కంటివాని చెరువు నుంచి కాజ ఈస్ట్ కు రాగా హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహేష్‌ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు.

కత్తితో దాడి .. మహిత మృతి .. కేసు నమోదు చేసిన పోలీసులు

కత్తితో దాడి .. మహిత మృతి .. కేసు నమోదు చేసిన పోలీసులు

వారిలో ఒకరు వెంట తెచ్చుకున్న కత్తితో మెడపైనా, చేతిపైనా దాడి చేశాడు. ఇది చూసిన స్థానికులు ఒక యువకుడిని వెంటాడి పట్టుకుని దేహశుద్ధి చేశారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారు. స్థానికులు పట్టుకున్న యువకుడి దగ్గర లభించిన ఆధార్‌ కార్డుపై కురెళ్ల మహేష్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ చిరునామా ఉంది. పాలకొల్లులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్‌ ప్రధాన నిందితుడని యలమంచిలి ఎస్సై గంగాధర్‌ తెలిపారు.

ప్రాణం తీసిన సినిమా అవకాశాలు ఇప్పిస్తామన్న పరిచయం

ప్రాణం తీసిన సినిమా అవకాశాలు ఇప్పిస్తామన్న పరిచయం

హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహేష్‌కు మహితతో కొంతకాలం నుంచి పరిచయం ఏర్పడిందని, సినీ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి పరిచయం పెంచుకున్నట్లు వివరించారు. మనస్పర్థలు రావడంతో పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అసలు హత్యా చేసేంత బలమైన కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+