నిధుల నిలిపివేత: చంద్రబాబు ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం షాక్

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పూర్తి కాని ప్రాజెక్టులకు నిధులను నిలిపేస్తూ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర కాలం అయినా చంద్రబాబు ప్రభు త్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం ప్రదర్శించింది. దీంతో కేంద్రం దాదాపు 100 కోట్ల రూపాయల మేర నిధులను నిలిపివ వేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

యూపీఏ హయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పర్యాటక ప్రాజెక్టులకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నిధుల విడుదలను ఆపివేసింది. ఇప్పటి వరకూ ఈ ఆరు నెలల కాలంలో కేవలం 11 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో 14 పర్యాటక ప్రాజెక్టులను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వీటిలో కాకినాడ బీచ్, అనంతపురం మెగా టూరిజం సర్కూట్, ఏటికొప్పాక, కూచిపూడి తదితర గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులు ఉన్నాయి.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం నుండి 135 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మాత్రం కేవలం 41.13 కోట్ల రూపాయలను మాత్రమే అప్పట్లో విడుదల చేసింది. యూపీఏ హయంలో విజయనగరం నుండి శ్రీకాకుళం పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టును 7.35 కోట్ల రూపాయాలతో ప్రారంభించారు. దీనికి కేంద్రం నుండి 2014లో 5.88 కోట్ల రూపాయలను మాత్రమే మంజూరు చేసింది.

Fund release stopped to Andhra Pradesh projects

అదే విధంగా 2011లో చిత్తూరు జిల్లాలోనూ ఇటువంటి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 2.84 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతాయని అంచనావేస్తే కేవలం 2.27 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కేంద్రం 7.72 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తే 6.18 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి పూర్తి కాకపోవడంతో మిగిలిన ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయకుండా నిలిపివేసింది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో చేపట్టిన టూరిజం ప్రాజెక్టు పనులకు సంబంధించి విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగ ధృవపత్రాలను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. ఆయా ప్రాజెక్టు పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, పనుల్లో పురోగతి, నిధులు ఖర్చు చేసిన తీరు తదితర వివరాలతో కూడిన వినియోగ ధృవపత్రాలను సమర్పిం చాల్సి ఉన్నా వాటిపై రాష్ట్రం స్పందించ లేదని సమాచారం.

ఆ ప్రాజెక్టు లన్నింటినీ పూర్తి చేయాలంటే రాష్ట్ర ఖజానా నుంచి నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడం తలకు మించిన భారంగా తయారు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+