పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎం .. ఆయన సింగిల్ పీస్ .. జూనియర్ ఎన్టీఆర్ పైనా వర్మ సెన్సేషన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా పలు సందర్భాల్లో విరుచుకుపడ్డ ఆర్జివి ఆమధ్య తాను నిర్మించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా లో పవన్ కళ్యాణ్ ను ఒక ఆవేశ పరుడైన రాజకీయ నాయకుడిగా చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇక అంతే కాదు పలుమార్లు పవన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించిన వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    Pawan Kalyan Is The Future CM - Ram Gopal Varma || Oneindia Telugu
    పవన్ వెరీ టఫ్.. యూనిక్.. వన్ పీస్

    పవన్ వెరీ టఫ్.. యూనిక్.. వన్ పీస్

    ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. అంతే కాదు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పమంటే వెరీ టఫ్.. యూనిక్.. వన్ పీస్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వర్మ. ఒకపక్క సినిమాలపైనే కాకుండా,రాజకీయ నాయకులపై కూడా వర్మ సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

     వర్మది పొగడ్తనా.... తెగడ్తనా

    వర్మది పొగడ్తనా.... తెగడ్తనా

    ఎప్పుడు పవన్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే రాంగోపాల్ వర్మ ఈసారి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు పవన్ ని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలా ? వెటకారమా ?అనేది అర్థం కాకుండా చెప్పారు. ప్రస్తుత రాజకీయాల మీద మాట్లాడిన వర్మ తన దృష్టిలో మంచి సీఎం అంటూ ఎవరు లేరని ఫ్యూచర్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ అని టక్కున చెప్పేశారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల పరంగా ఇష్టపడతానని, ఒక పొలిటీషియన్ గా మాత్రం కాదని పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ.

     ఫ్యూచర్ సీఎం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హల్చల్

    ఫ్యూచర్ సీఎం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హల్చల్

    పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓన్లీ వన్ పీస్ అంటూ మాట్లాడిన వర్మ వెటకారంగా మాట్లాడినా ,ఎలా మాట్లాడినా ఫ్యూచర్ సీఎం పవన్ అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. జూనియర్ ఎన్టీఆర్ బెటర్ థాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు కారణమవుతున్నాయి.

    వర్మ వ్యాఖ్యలపై ఏపీలో జోరుగా చర్చ

    వర్మ వ్యాఖ్యలపై ఏపీలో జోరుగా చర్చ

    కొందరు వర్మ చేసిన వ్యాఖ్యలపై సంబర పడుతుంటే, మరికొందరు వర్మ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు రా నాయనా అంటూ సందిగ్దంలో పడుతున్నారు. అప్పుడే పొగుడుతాడు, అంతలోనే తిడతాడు అని వర్మపై రాజకీయ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా సంచలనాలకు కేరాఫ్ అయిన రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయాల్లో సంచలనం అని అభిమానులు అందరూ భావించే పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ సీఎం అంటూ ఏపీలో జనసైనికులు, మెగా ఫాన్స్, పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ హల్ చల్ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+