రాజధాని వస్తుందని దొనకొండలో భూమి కొనుగోలు, కడుపు మంట: రోజాకు గాలి కౌంటర్
హైదరాబాద్: రాజధాని అమరావతి పైన తీవ్ర ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం నాడు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతోనే సింగపూర్ ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్ను ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దొనకొండలో రాజధాని వస్తుందని భావించి, అక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు.

దొనకొండలో రాజధాని వస్తే తమ భూములకు విలువ పెరుగుతుందని భావించారన్నారు. ఇప్పుడు రాజధాని దొనకొండలో కాకుండా, అమరావతిలో రావడంతో వారు కడుపు మంటతోనే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖాయమన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం ఇప్పుడు అమలవుతుందన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భరోసా యాత్ర పైన కూడా గాలి స్పందించారు. వైయస్ హయాంలో 1400 మంది రైతులు చనిపోతే అప్పుడు ఎందుకు భరోసా యాత్ర చేయలేదని ప్రశ్నించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications