మహిళా బిల్లు ఎఫెక్ట్, ఏపీలో సీన్ ఛేంజ్ - జరిగేదేంటి, గెలుపెవరిది..!!

ఏపీలో ఎన్నికల వేళ సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో కొత్త టర్న్ తీసుకున్నాయి. ఎన్నికల కోసం అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీల కసరత్తు తుది దశకు చేరుకుంది. నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా హోరా హోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. ఇదే సమయంలో మహిళా బిల్లు ఆమోదానికి కేంద్రం అడుగులు వేస్తోంది. మహిళా బిల్లు అన్ని అవరోధాలు దాటి చట్టంగా మారితే ఏపీలో రాజకీయ లెక్కలే మారిపోనున్నాయి. ఏం జరిగే అవకాశం ఉంది.

మహిళా బిల్లు ఆమోదంతో:ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధుల ఎంపికకు సర్వేలు కీలకంగా మారుతున్నాయి. ఇక అభ్యర్దులు తామేనని ఆశావాహులు భావిస్తున్న సమయంలో కేంద్రం సడన్ గా మహిళా బిల్లును తెర మీదకు తీసుకొచ్చింది.

Women Reservation Bill

ఈ ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొందటం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం తరువాత 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో సహా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు సిద్దంగా ఉన్నాయి. అయితే, ఈ బిల్లుకు మొత్తం 29 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం పొందటం కూడా సులభంగానే కనిపిస్తోంది. ఆ వెంటనే మహిళా రిజర్వ్ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. అక్కడే చిక్కుముడి ఉంది.

ఏపీలో మారనున్న లెక్కలు:2021 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వ్ స్థానాలను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇదే మొత్తం వ్యవహారంలో కీలకం కానుంది. ఇక్కడ న్యాయపరమైన..ఇతర అవాంతరాలు లేకపోతే 2024 ఎన్నికల సమయానికి మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారే అవకాశం ఉంది.

ఇక, ఈ చట్టం అమల్లోకి రావటం ద్వారా 33 శాతం స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏపీ శాసన సభలో 57-58 స్థానాలు మహిళలకు కేటాయించాలి. ప్రస్తుత సభలో మహిళా సభ్యుల సంఖ్య 15గా ఉంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ పదవులతోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఈ తాజా బిల్లు ఆమోదం పొందింతే అవకాశం వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదానికి ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Game Changer: Women Reservation Bill shifts political dynamics in AP ahead of 2024 elections

గెలుపు ఓటముల్లో కీలకంగా:ఇక, ఈ బిల్లు చట్టంగా అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి పలువురు ఆశావాహులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కోసం భారీగా ఖర్చు చేస్తూ... ప్రణాళికలతో సిద్దం అవుతున్నారు.

ఇక, పొత్తుల సమయంలోనూ మహిళా సీట్ల కేటాయింపు కీలకం కానుంది. అయితే, మహిళలకు కేటాయించే సీట్ల రిజర్వేషన్ ఖరారు తరువాతనే ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటుందనేది స్పష్టత రానుంది. ఈ మొత్తం ప్రక్రియ వేళ అసల 2024 ఎన్నికలకు సాధ్యమా..కాదా అనేది మరో చర్చ. మహిళా బిల్లు 2024 ఎన్నికల్లోనే అమలు చేయాల్సి వస్తే ఏపీ రాజకీయంగా మహిళా అభ్యర్దులే కీలకం కానున్నారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా జగన్ తొలి నుంచి అడుగులు వేస్తున్నారు. దీంతో, ఇప్పుడు మహిళా అభ్యర్దులు..మహిళా ఓటర్లు ఏపీ ఎన్నికల్లో గెలుపు ఓటమలును ప్రభావితం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+