కృష్ణా జిల్లాలో బాలికపై గ్యాంగ్ రేప్ .. ఏపీలో బాలికలపై కొనసాగుతున్న రాక్షస క్రీడ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోబాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రేమోన్మాదుల దాడులు ఒకవైపు, సామూహిక అత్యాచారాలు మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఏపీలో మహిళల, బాలికల రక్షణ కరువు అవుతుందని, జగన్ సర్కార్ మహిళల రక్షణపై దృష్టి సారించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకో చోట బాలికలపై అత్యాచారాలు చోటుచేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ బాలికలు, మహిళల రక్షణ ప్రశ్నార్థకంగానే మారుతుంది.

గొడ్ల చావిడిలో బాలికపై సామూహిక అత్యాచారం

గొడ్ల చావిడిలో బాలికపై సామూహిక అత్యాచారం

తాజాగా కృష్ణా జిల్లాలో ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఏపీలో బాలికలపై అత్యాచారాలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ, మరో ఘటన చోటు చేసుకోవడం ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతుంది. కృష్ణాజిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది .14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట ఒక నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి గొడ్ల చావడిలోకి తీసుకువెళ్లాడు. పశువుల కొట్టంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా బాలికపై అత్యాచారం చేశారు.

 తండ్రి ఫిర్యాదు .. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

తండ్రి ఫిర్యాదు .. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు


బాలిక ఎంతకీ కనిపించకపోవడంతో, ఇంటికి తిరిగి రాకపోవటంతో తమ కుమార్తె కనిపించటం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన పోలీసులు బాలికను గుర్తించి విచారణ జరపగా తనపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని బాలిక పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాలికలపై అత్యాచార ఘటనలపై కేసులు ఏపీ పోలీస్ స్టేషన్లలో జోరుగా నమోదవుతున్నాయి.

రాజుపాలెం మైనర్ బాలిక రేప్ ఘటన, ద్వారకా తిరుమల ఘటన బాలికపై రేప్ ఘటన మరచిపోకముందే

రాజుపాలెం మైనర్ బాలిక రేప్ ఘటన, ద్వారకా తిరుమల ఘటన బాలికపై రేప్ ఘటన మరచిపోకముందే

ఇటీవల గుంటూరు జిల్లా రాజుపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపగా, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఏపీ వాసులను విస్మయానికి గురి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని పంగిడి గూడెం గ్రామంలో ఓ 15 ఏళ్ళ మైనర్ బాలికను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలు మరచిపోకముందే మళ్ళీ మరో ఘటన జరిగింది.

Recommended Video

    Agriculture and Mining Saves the Economy Says Experts
    నిత్యకృత్యంగా మారుతున్న రేప్ లు .. ఏపీలో బాలికలపై రాక్షస క్రీడ

    నిత్యకృత్యంగా మారుతున్న రేప్ లు .. ఏపీలో బాలికలపై రాక్షస క్రీడ

    ప్రేమ పేరుతో బాలికలను మోసం చేయడం, పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకువెళ్లి అత్యాచారాలకు పాల్పడడం, చాక్లెట్ ఆశ చూపి నిర్మానుష్య ప్రదేశానికి బాలికల తీసుకువెళ్ళి రేప్ చేయడం వంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి. దిశా వంటి చట్టాలను తీసుకువచ్చినా కామాంధుల దృష్టిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే ఏపీలో టీడీపీ రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డెడ్ లైన్ విధించి మరీ పోరాటం చేస్తుంది. మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తూనే ఉంటామని వెల్లడించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామని ఇప్పటికే అల్టిమేటం జారీ చేసి మరీ పోరాటం చేస్తుంది. అయినా సరే రాష్ట్రంలో బాలికలపై రేప్ ఘటనలు ఆగటం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో బాలికలపై రాక్షస క్రీడ కొనసాగుతూనే ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+