5 ఎకరాల భూమిపై కన్ను పడింది: నయీం గ్యాంగ్‌పై ఏపీలో తొలి కేసు నమోదు

అమరావతి: నయీం గ్యాంగ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు నమోదైంది. ఓ భూ వివాదంలో నయీం అనుచరులమని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు విశాఖ జిల్లా భీమిలి సిఐ టి. అప్పలనాయుడు తెలిపారు. గురువారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

భీమిలి మండలం కాపులుప్పాడలో సర్వే నెంబర్లు 117/5, 117/6, 117/4, 117/7, 117/9, 117/22, 185/2లలో సుమారు అయిదెకరాల మేర భూమిని 1988లో విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అంపావల్లికి చెందిన బొడ్డూరి భూషణం అన్ రిజిస్టర్ ద్వారా కొనుగోలు చేసేందుకు స్థలాల యాజమాన్యాల నుండి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఒప్పందం అనంతరం ఆయన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే భూషణం 2014లో తన భూమి వద్దకు వెళ్లి చూడగా అది ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన దంతులూరి సూర్యనారాయణవర్మ ఆ భూమి తనదని, 2007లో తాము కొనుగోలు చేశానని, పైగా తాము నరుూం అనుచరులమని తెలిపాడు.

Gangster Nayeem's victim filed a case in Bheemili police station at Vizag

తమకు అడ్డొస్తే అంతు చూస్తామని సూర్యనారాయణవర్మ భూషణాన్ని బెదించారించాడని సిఐ వివరించారు. దీంతోపాటు తనను కులం పేరుతో దూషించినట్లు భూషణం తెలిపాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీటిపై గతనెల 21న భూషణం తమకు ఫిర్యాదు చేసినట్లు సిఐ అప్పలనాయుడు తెలిపారు.

అయితే కృష్ణా పుష్కరాల నిమిత్తం తాము ఇక్కడ లేమని, అనంతరం తిరిగి వచ్చిన తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. భూషణాన్ని కులం పేరుతో దూషించారన్న దానిపై నరుూం అనుచరులుగా భావిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ సెల్ ఎసిపి మోహనరావు కేసును చూస్తున్నారని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+