లా కాలేజీని దత్తతు తీసుకున్న మంత్రి గంటా
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం లా కాలేజీని దత్తతు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆదివారం విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపర్‌లో మాట్లాడుతూ లా కాలేజీని మోడల్ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు.
ప్రతి ఏటా పూర్వ విద్యార్ధుల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హుధూద్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూ. 3 కోట్ల విరాళాలు అందాయని పేర్కొన్నారు. హుధుద్ తుఫాన్‌ను జయించిన సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం సంబురాలు నిర్వహించనుందని తెలిపారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 90 శాతం విద్యుత్ పునరుద్దరించినట్లు తెలిపారు. విద్యార్ధులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించామన్నారు.
రేపటి నుంచి తరగతి గదులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తుఫాన్ భీభత్సానికి అల్లకల్లోలం అయిన యూనివర్సిటీ కోసం పూర్వ విద్యార్ధులు దారాళంగా విరాళాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications