వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా శ్రీనివాస్ భారీ ట్విస్ట్ - చిరంజీవి ఆలోచనతో : కొత్త బాధ్యతలు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి..టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలోకి ఎంట్రీ ఖయమా. ఇప్పుడు ఇదే అంశంపైన గంటా స్వయంగా స్పందించారు. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కొత్త బాధ్యతలు స్వీకరించారు. కాపుల అభివృద్ధి కోసం..ఏ కార్యక్రమం పెట్టినా తాను ముందు ఉంటానన్నారు. ఈ నెల 26న విశాఖలో వంగవీటి రంగా వర్ధంతి నాడు కాపునాడు బహిరంగ సభకు నిర్ణయించారు. పోస్టర్ ను ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణను సంస్థ నిర్వాహకులు చిరంజీవితో ప్రారంభించాలని ఆలోచన చేశారని, ఆయన అందుబాటులో లేకపోవడం వలన తాను పోస్టర్ లాంచింగ్ చేశానన్నారు. పార్టీల గురించి కామెంట్స్ చేసారు.

రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలే కాదు - సంకేతాలు క్లియర్

రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలే కాదు - సంకేతాలు క్లియర్


కొంత కాలంగా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం తన అనుచర వర్గంతోనూ చర్చలు చేసారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉన్న గంటా శ్రీనివాస రావు పార్టీ మార్పు పైన చర్చించినట్లు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం. మెగాస్టార్ తో చర్చల తరువాత జనసేన దిశగా గంటా అడుగులు పడినట్లు చెబుతున్నారు. ఇదే సమయం లో వైసీపీలో సీనియర్ మంత్రి..ముఖ్యమంత్రి బంధువుతో గంటా చర్చలు..వైసీపీలో చేరికకు నిర్ణయం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీని పైన స్వయంగా స్పందించిన గంటా.. రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలే కాదంటూ పరోక్షంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ.. చేరుతాననే ప్రచారంలో ఉన్న వైసీపీ గురించి చెప్పుకొచ్చారు. మూడో పార్టీగా జనసేన గురించి పరోక్షంగా చెప్పినట్లు స్పష్టం అవుతోంది. అదే సమయంలో కాపుల అభివృద్ధి కోసం తాను ముందుటానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

వైసీపీలో చేరిక పైన గంటా ఏమన్నారు..

వైసీపీలో చేరిక పైన గంటా ఏమన్నారు..

పార్టీ మార్పు పైన తానెప్పుడూ మాట్లాడలేదని గంటా చెప్పుకొచ్చారు. నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని స్పష్టం చేసారు. ఏ కార్యక్రమం చేసినా అనివార్యంగా రాజకీయాలతో ముడిపడి ఉంటుందని గంటా వ్యాఖ్యానించారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్..విశాఖ వేదికగా కాపు ప్రముఖుల సమావేశాలు జరిగాయి. రాజకీయంగా కాపు వర్గానికి ప్రాధాన్యత గురించి నేతలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు వైసీపీ లోని కాపు నేతలు మినహా ఇతర పార్టీల్లోని వారంతా హాజరయ్యారు. రిటైర్డ్ సివిల్ సర్వీసు అధికారులు ఆ సమావేశంలో ఉన్నారు. ఇక, మెగాస్టార్ చిరంజీవితో ఎమ్మెల్యే గంటాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యం లో గంటా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ ల విలీనం తరువాత చిరంజీవి సిఫార్పుతో కిరణ్ కేబినెట్ లో గంటా మంత్రిగా పని చేసారు. ఆ తరువాత కూడా చిరంజీవితో - గంటా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ విశాఖ పర్యటన సమయంలోనూ జనసేనానితో గంటా సమావేశమయ్యారనే ప్రచారం సాగింది.
విశాఖ కేంద్రంగా గంటా కొత్త బాధ్యతలు..

విశాఖ కేంద్రంగా గంటా కొత్త బాధ్యతలు..

గంటా శ్రీనివాస్ కాపుల అభివృద్ధి కోసం..ఏ కార్యక్రమం పెట్టిన ముందు ఉంటానని స్పష్టం చేసారు. ఈ నెల 26న విశాఖ కేంద్రంగా కాపునాడు బహిరంగ పోస్టర్ ను ఆవిష్కరించారు. దీనికి చిరంజీవి రావాల్సి ఉందని చెప్పారు. రాధా, రంగా, రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాపునాడు సభ జరుగుతుందని వెల్లడించారు. వంగవీటి పేరుకు సమాజంలో ఒక వైబ్రేషన్ ఉందన్నారు. ఇటు వంగవీటి రాధా విజయవాడ కేంద్రంగా కీలకంగా మారారు. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నా.. ఎన్నికల నాటికి జనసేనలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు గంటా ఇచ్చిన సంకేతాలు అదే రకంగా కనిపిస్తున్నాయనే వాదన ఉంది. దీంతో, రానున్న రోజుల్లో జనసేన కేంద్రంగా ఏపీలో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
TDP MLA Ganta Srinivasa Rao intersting comments on Party change and on Kapu Nadu public meeting at Vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X