గీతాంజలి ఆత్మహత్య కేసులో కీలకపరిణామం: రాంబాబు అరెస్ట్, ఎవరీ రాంబాబు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి గీతాంజలి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ తట్టుకోలేక, బంధుమిత్రుల సూటిపోటి మాటలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. టిడిపి జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి మృతి చెందిందని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి ఆరోపణలు చేస్తున్న వేళ దానిని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది టిడిపి జనసేన.

అయితే గీతాంజలి మృతికి కారణమైన టిడిపి సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.విజయవాడ సింగ్ నగర్ లో తెనాలి పోలీసులు గీతాంజలి ఆత్మహత్య కేసులో టిడిపి సోషల్ మీడియా కార్యకర్త అయిన రాంబాబును అరెస్టు చేసి అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Geetanjali death case Key development TDP Social Media Worker Rambabu Arrested

సోషల్ మీడియాలో గీతాంజలి పై దారుణమైన పోస్ట్ పెట్టిన రాంబాబు ని అరెస్ట్ చేసిన పోలీసులు, అతను తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలైన బోండా ఉమా వంటి ఎంతోమందికి సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించారు. నిత్యం ట్విట్టర్ వేదికగా వైసిపిని టార్గెట్ చేస్తూ ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్ట్ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది.

అమ్మ ఒడి ఇచ్చిందే నాలుగు సార్లు అయితే ఐదు సార్లు తీసుకున్నానని గీతాంజలి చేసిన వ్యాఖ్యలే ఆమెని ట్రోల్ చేయడానికి టిడిపి జనసేన సోషల్ మీడియా ఉపయోగించుకుంది. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో రాంబాబు గీతాంజలిని దూషిస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దారుణంగా గీతాంజలి ట్రోల్ అయ్యింది.

దీంతో ఈ అవమానాలు భరించలేకపోయిన రైలు కిందపడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. అయితే దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయం మొదలైంది. వైఎస్ఆర్సిపి ముఖ్యంగా టిడిపి, జనసేన ను టార్గెట్ చేస్తూ ఈ రెండు పార్టీల తీరుపై మండిపడుతోంది. ఈ ఘాతుకానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమం లోనే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన టిడిపి సోషల్ మీడియా కార్యకర్త రాంబాబు ని అరెస్ట్ చేశారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+