నగ్నచిత్రాలు ఉన్నాయని బాలికపై అత్యాచారం: గర్భం దాల్చినా వదలని దుర్మార్గుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: 'నీ అర్ధనగ్న ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్లు వినకుంటే ఫొటోలు నెట్‌లో పెడతా' అంటూ బాలికను బలవంతంగా లొంగదీసుకున్నాడు. పదే పదే పిలిపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు అతడి వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బాధితురాలి స్వస్థలం నెల్లూరు పట్టణంలోని మూలాపేట నీలగిరిసంఘం. పాలిటెక్నిక్ డిప్లొమో సెకండియర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఉడతా సురేశ్‌ జిరాక్స్‌ దుకాణం నడుపుతున్నాడు.

అంతకముందే వివాహమైన ఇతడికి ఇద్దరు పిల్లలున్నారు. అయినా, అతడు బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలలుగా వెంటపడుతున్నాడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబసభ్యుల హామీ మేరకు కేసు ఉపసంహరించుకొన్నారు.

Girl commits suicide in Nellore district, Andhra Pradesh

కొంతకాలం బాగానే గడిచింది. అయినా, అతని ప్రవర్తనలో మార్పురాలేదు. బాలిక కాలేజీకి వెళుతున్న సమయంలో వెంటపడేవాడు. ఒకరోజు సురేశ్‌.. ఫోన్‌లో బాలికను తీవ్రంగా బెదిరించాడు. ''నీకు సంబంధించిన నీలి చిత్రాలు కొన్ని నా దగ్గరున్నాయి. మా షాపు దగ్గరకొస్తే ఇస్తాను'' అని చెప్పడంతో బాధితురాలు అక్కడికెళ్లింది.

ఆ నీలిచిత్రాలు ఇవ్వవని బతిమాలింది. ఆమె నిస్సహాయతని సురేశ్‌ అవకాశంగా తీసుకొని.. బలవంతంగా లొంగదీసుకొన్నాడు. తాను చెప్పినట్లు వినాలని బెదిరించి తన షాపునకు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు.

దీంతో బాలిక అతని వికృత చేష్టలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయినా వదలకుండా ఆమెపై సురేశ్‌ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దాంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక గర్భవతి కాగా అబార్షన్ పిల్స్ మింగించాడు.

ఈ క్రమంలో ఈ నెల మూడోతేదీన టెక్కేమిట్టలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. నిద్రమాత్రలు మింగి చనిపోవాలని ప్రయత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు సురేశ్‌పై ఫోక్సా యాక్ట్‌ ప్రయోగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Girl commits suicide in nellore district, Andhra Pradesh. Zerox shop owner takes her nude pics and waraned to do sex with him. Because of that reason girl commits suicide.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి