దారుణం: రెండేళ్ల పసిపాపకు మద్యం తాగించి చంపేశారు!

రహీమా తన భర్త నుండి ఆరు నెలల క్రితం విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం రహీమా తన కూతురును తన భర్త వద్దకు తీసుకు వెళ్లాల్సిందిగా భర్త స్నేహితుడు సైదాను కోరింది. సైదా చిన్నారిని తండ్రి వద్దకు తీసుకు వెళ్లడానికి ముందు తన ఇంటికి వెళ్లి మద్యం తాగాడు.
తన కూతురును ఇంటికి తీసుకు వెళ్లిన సైదా ఆమె ఏడవడాన్ని చూసి మద్యం తాగించాడని తల్లి రహీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సైదా వాదన మరో రకంగా ఉంది. తాను చిన్నారికి సాఫ్టు డ్రింక్ ఇచ్చి తాను బాత్ రూంకు వెళ్లానని, ఆ లోగా పాప మద్యం తాగిందని, దానిని గుర్తించిన తాను వెంటనే జిజిహెచ్ ఆసుపత్రికి తరలించానని పోలీసులకు చెప్పాడు. వైద్యులు పాప మృతి చెందినట్లు ధృవీకరించినట్లు చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. రహీమా తన చిన్నారని తండ్రికి అప్పగించమని సైదాకు ఇచ్చింది. అయితే ఆ పాపను తండ్రి అంగీకరించడం లేదు. తన కూతురు కాదని చెప్పి పాపను తీసుకునేందుకు నిరాకరించాడు.
దీంతో సైదా పాపను పిల్లలు లేని తల్లిదండ్రులకు అప్పగించాడు. వారు సోమవారం చీప్ లిక్కర్ తాగారు. ఆ సమయంలో పాపకు కూడా తాగించారు. పాప శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన పెంపుడు తండ్రి ఆమెను ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగా పాప మరణించింది. ఇబ్బందుల్లో పడతానని గుర్తించిన అతను పాపను క్యాజువాలిటీలో ఉంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అతనిని చూసిన పలువురు పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications