స్నానం చేస్తుంటే నగ్నచిత్రాలు: బెదిరించి యువతిపై పలుమార్లు రేప్!
హైదరాబాద్: నగ్న చిత్రాలు తీసి వాటిని అడ్డుపెట్టుకొని పందొమ్మిదేళ్ల యువతిపై తరచూ అత్యాచారానికి పాల్పడుతున్న ఓ వ్యక్తి బండారం బయటపడింది. అతగాడి వేధింపులు మితిమీరటంతో తాళలేక బాధితురాలు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ సంఘటన అమలాపురం సమీపంలో జరిగింది. వెంకట ప్రసాద్ అనే వ్యక్తి ఓ యువతిపై కన్నేశాడు. ఆ యువతి తల్లిదండ్రులు, సోదరుడు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో దూరి ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలు చిత్రీకరించాడు. వీటిని నెట్‌లో పెట్టి అల్లరి చేస్తానంటూ బెదిరించి ఆమె ఇంట్లోనే తరచూ కామవాంఛ తీర్చుకునేవాడు.
అతని వేధింపులు పెరిగిపోవడంతో తట్టుకోలేని ఆ యువతి శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను శుక్రవారం రాత్రి అమలాపురంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.

టీచర్‌పై దాడిచేసిన హోంగార్డు ఆత్మహత్య
విశాఖపట్నం ఏజెన్సీలోని చింతపల్లి మండలం దోమలగొందిలో ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడిచేసిన హోంగార్డు మానిక రాజేష్(25) ఆత్మహత్య చేసుకున్నాడు.
తనను పెళ్లి చేసుకోవాలంటూ వరుసకు మేనత్త అ యిన కొర్ర రత్నకుమారి వెంటపడుతుండే ఆమె నిరాకరించింది. దాంతో పథకం ప్రకారం ఆమెపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన రాజేష్ సమీప అడవుల్లోకి పారిపోయాడు. పోలీసుల గాలింపు ఉధృ తం కావడంతో అరెస్టు భయంతో శుక్రవారం రాత్రి అడవిలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications