సూపర్ న్యూస్.. రూ.300కోట్లతో అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అమరావతిపై ఫోకస్ చేస్తుంది. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలను, విశ్వా విద్యాలయాలను అమరావతికి తీసుకు వచ్చింది. తాజాగా అమరావతిలో మరో గ్లోబల్ విద్యా సంస్థ ఏర్పాటు కానుంది.

గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు ఒప్పందం

ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన సరికొత్త విద్యా సంస్థ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS), ఏపీ సీఆర్డీఏ (AP CRDA) మధ్య ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది.

Global Indian International School amaravati AP CRDA signs an MoU with GIIS to establish a campus

రూ. 300 కోట్లతో అంతర్జాతీయ క్యాంపస్

రాజధాని ప్రాంతంలో విద్యా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం, శాఖమూరు ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పాఠశాలను స్థాపించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 ఎకరాల భూమిని కేటాయించింది. సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ఈ సరికొత్త క్యాంపస్‌ను నిర్మించనున్నారు.

అమరావతిలో ఆరో క్యాంపస్‌

ఈ ప్రతిపాదిత ఒప్పందంపై సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ రాయ్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ , GIIS K12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రీ డైరెక్టర్ రాజీవ్ కౌల్ అధికారికంగా సంతకాలు చేశారు. జీఐఐఎస్ విద్యాసంస్థలకు అంతర్జాతీయంగా సింగపూర్, జపాన్, యూఏఈ వంటి వివిధ దేశాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే ఐదు నగరాలలో విజయవంతంగా నడుస్తున్న ఈ విద్యాసంస్థ, అమరావతిలో తన ఆరో క్యాంపస్‌ను ప్రారంభిస్తోంది.

తెలంగాణ ఫ్యూచర్‌సిటీలో మరో 37 గ్రామాలు విలీనం.. ఆ విజ్ఞప్తులతో రేవంత్ నిర్ణయం!
తెలంగాణ ఫ్యూచర్‌సిటీలో మరో 37 గ్రామాలు విలీనం.. ఆ విజ్ఞప్తులతో రేవంత్ నిర్ణయం!

గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు

అమరావతిలో ఇప్పటికే పలు ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, పాఠశాల విద్యా విభాగంలో అంతర్జాతీయ స్థాయి సంస్థ లేని లోటును ఈ కొత్త ప్రాజెక్టు భర్తీ చేయనుంది. ఈ క్యాంపస్ ఏర్పాటు ద్వారా అమరావతి మరియు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన నాణ్యమైన విద్య స్థానికంగానే అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా, ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+