AP Exit Polls 2024: ఎగ్టిట్ పోల్స్ ను ముందే తేల్చేస్తున్న గోదావరి బెట్టింగ్స్ ..!

ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన భారీ పోలింగ్, ముఖ్యంగా రెట్టింగు స్ధాయిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఈసారి ఫలితాలపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని విశ్లేషించిన పలు సర్వే, మీడియా సంస్థలు ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతకంటే ముందే గోదావరి జిల్లాల్లో సాగుతున్న భారీ బెట్టింగ్ ఈసారి ఫలితాలను ముందే చెప్పేస్తోంది.

ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో పోలింగ్ సరళిని గమనిస్తే మార్పు కోరుకున్నట్లు స్పష్టంగా అర్ధమైంది. ముఖ్యంగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ జత కట్టడం, పిఠాపురం ఎన్నికల బరిలోకి దిగడం వంటి కారణాలతో గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీలకూ సానుకూలత వచ్చింది. మధ్యలో బీజేపీ అభ్యర్ధులకు కూడా మేలు జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పార్టీలు, అభ్యర్ధుల గెలుపోటములపై బెట్టింగ్ కూడా ప్రారంభమైంది.

Godavari districts betting reveal exit poll trends before announcement

ఆరంభంలో ఈ బెట్టింగ్ సరళి కూటమికి అనుకూలంగా ఒకటికి నాలుగు అన్నట్లుగా సాగింది. అయితే ఆ తర్వాత సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు వరుసగా చేసిన ప్రకటనలతో ఈ సమీకరణం కాస్తా ఒకటికి రెండు అన్నట్లుగా మారిపోయిందని చెప్తున్నారు. వందల కోట్ల రూపాయలను కూటమికి అనుకూలంగా ఇక్కడ పందాలు కాసేస్తున్నారు.

దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు సహజంగానే డీలా పడ్డారు. ఫలితాల సరళిని ముందే తేల్చేలా సాగుతున్న ఈ బెట్టింగ్ లను చూస్తుంటే ఎగ్టిట్ పోల్స్ కూడా అనవసరం అన్నట్లుగా ఉందని పలువురు స్థానికులు చెప్తున్నారు. దీంతో ఇవాళ వెలువడే ఎగ్జిట్ పోల్స్ ను కూడా బెట్టింగ్ రాయుళ్లు పట్టించుకునే పరిస్ధితి కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+