పుష్కరాల్లో విషాదం: పిండ ప్రదానం చేస్తూ బెజవాడ వాసి మృతి (ఫోటోలు)
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. పుష్కర స్నానానికి వెళ్లిన యువకుడు మృతి చెందగా, పిండ ప్రదానం చేస్తూ మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ధవళేశ్వరంలోని గాయత్రి పుష్కరఘాట్ వద్ద విజయవాడకు చెందిన బ్యాంక్ మేనేజర్ (రిటైర్డ్) మహంకాళి సుబ్బయ్య మృతి చెందాడు. ఈ ఘాట్‌లో పుష్కరస్నానం చేసిన అనంతరం పిండ ప్రదానం చేస్తున్న ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
వెంటనే కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వగా, వాహనం అక్కడికి వచ్చేలోగానే సుబ్బయ్య చనిపోయాడు. పుష్కరాలకు వచ్చి సుబ్బయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన స్వామి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కాటేరులో ఉన్న అనధికారు పుష్కరఘాట్ వద్ద స్నానానికి వెళ్లాడు. స్నానమాచరించే క్రమంలో నది లోపలికి వెళ్లడంతో నీళ్లలో మునిగిపోయి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గజఈతగాళ్ల సాయంతో వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పిండ ప్రదానం చేస్తూ ఓ వ్యక్తి మృతి
గోదావరి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. ధవళేశ్వరంలోని గాయత్రి పుష్కరఘాట్ వద్ద విజయవాడకు చెందిన బ్యాంక్ మేనేజర్ (రిటైర్డ్) మహంకాళి సుబ్బయ్య మృతి చెందాడు.

పిండ ప్రదానం చేస్తూ ఓ వ్యక్తి మృతి
ఈ ఘాట్‌లో పుష్కరస్నానం చేసిన అనంతరం పిండ ప్రదానం చేస్తున్న ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వగా, వాహనం అక్కడికి వచ్చేలోగానే సుబ్బయ్య చనిపోయాడు.

పిండ ప్రదానం చేస్తూ ఓ వ్యక్తి మృతి
పుష్కరాలకు వచ్చి సుబ్బయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పిండ ప్రదానం చేస్తూ ఓ వ్యక్తి మృతి
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన స్వామి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కాటేరులో ఉన్న అనధికారు పుష్కరఘాట్ వద్ద స్నానానికి వెళ్లాడు. స్నానమాచరించే క్రమంలో నది లోపలికి వెళ్లడంతో నీళ్లలో మునిగిపోయి మృతి చెందాడు.












Click it and Unblock the Notifications