సర్వభూపాల వాహనంపై అమ్మవారి వైభవం(పిక్చర్స్)
తిరుపతి: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామితో సమానమైన రాజసాన్ని, వైభవాన్ని కలిగి, శ్రీవారి దేవేరి పద్మావతి దేవి సోమవారం సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన సోమవారం ఉదయం అమ్మవారు నవనీత చోరుని అలంకరణలో నాలుగు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.
అమ్మవారిని వేకువజామునే సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాల నిర్వహణ అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని వాహన సేవ మండపంలోకి చేర్చారు. పట్టుపీతాంబర వజ్ర వైఢూర్య ఆభరణాలతో అమ్మను వెన్నచేత బట్టిన నవనీత చోరునిగా అర్చకస్వాములు సుందరంగా అలంకరించారు.
సోమవారం సాయంత్రం అనంత సూర్య తేజోమయి అయిన పద్మావతి దేవి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథంపై విహరిస్తున్న అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వర్ణ రథ సేవలో పాల్గొని పునీతులయ్యారు. స్వర్ణరథం ఆరంభం నుంచి చివరి వరకు మహిళల చేతనే రథాన్ని లాగించడం విశేషం.

అమ్మవారి వైభవం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామితో సమానమైన రాజసాన్ని, వైభవాన్ని కలిగి, శ్రీవారి దేవేరి పద్మావతి దేవి సోమవారం సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు.

అమ్మవారి వైభవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన సోమవారం ఉదయం అమ్మవారు నవనీత చోరుని అలంకరణలో నాలుగు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.

అమ్మవారి వైభవం
అమ్మవారిని వేకువజామునే సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాల నిర్వహణ అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని వాహన సేవ మండపంలోకి చేర్చారు.

అమ్మవారి వైభవం
పట్టుపీతాంబర వజ్ర వైఢూర్య ఆభరణాలతో అమ్మను వెన్నచేత బట్టిన నవనీత చోరునిగా అర్చకస్వాములు సుందరంగా అలంకరించారు.

అమ్మవారి వైభవం
సోమవారం సాయంత్రం అనంత సూర్య తేజోమయి అయిన పద్మావతి దేవి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

అమ్మవారి వైభవం
స్వర్ణరథంపై విహరిస్తున్న అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలు కర్పూర నీరాజనాలు సమర్పించారు.

అమ్మవారి వైభవం
అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వర్ణ రథ సేవలో పాల్గొని నీతులయ్యారు. స్వర్ణరథం ఆరంభం నుంచి చివరి వరకు మహిళల చేతనే రథాన్ని లాగించడం విశేషం.

అమ్మవారి వైభవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన సోమవారం రాత్రి అమ్మవారి గరుడ వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.

అమ్మవారి వైభవం
బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో విశిష్టత ఉంది. ఎంతో విశిష్టమైన గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు ఇష్టపడతారు. తనివితీరా దర్శించి తరిస్తారు.

అమ్మవారి వైభవం
తిరుమల నుంచి తెచ్చిన శ్రీవారి పాదాలను అమ్మవారికి ధరించేసి అమ్మవారిని శ్రీ మహావిష్ణుమూర్తిగా ఆలయ అర్చకులు అత్యంత శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై అధిష్టింపచేశారు.

అమ్మవారి వైభవం
అనంతరం సర్వాంగ శోభితురాలైన పద్మావతి అమ్మవారు గరుఢ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల కోర్కెలను తీర్చారు.

అమ్మవారి వైభవం
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ ఎంజి గోపాల్ దంపతులు, జెఈఓ పోలాభాస్కర్ దంపతులు, టిటిడి మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications