విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనా ఎఫెక్ట్?: పసిడి ధరల్లో భారీ పతనం: హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో గోల్డ్ రేట్స్ ఇవే

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బంగారం ధరలు మరోసారి నేలచూపులు చూశాయి. వాటి పతనం కొనసాగుతూనే వస్తోంది. గరిష్ఠంగా 57 వేలకు పైగా పలికిన 10 గ్రాముల పసిడి ధర క్రమం తప్పకుండా క్షీణిస్తూనే వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకుంటోన్న మార్పుల వల్లే బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి- డాలర్‌ను బలోపేతం చేయడానికి అమెరికా చేస్తోన్న ప్రయత్నాల వల్ల గోల్డ్ రేట్లు పడిపోతున్నాయని అంచనా వేస్తున్నారు.

 ఎంసీఎక్స్‌లో రూ. 370 మేర క్షీణత

ఎంసీఎక్స్‌లో రూ. 370 మేర క్షీణత

మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో తాజాగా రికార్డయిన వివరాల ప్రకారం.. బంగారం ధరల్లో 370 రూపాయల క్షీణత కనిపించింది. 10 గ్రాముల పసిడి ధర 53,300లుగా నమోదైంది. ఇదివరకటి ధరతో పోల్చుకుంటే 370 రూపాయల తగ్గుదల చోటు చేసుకుంది. వెండిధరలోనూ ఇదే తరహా పతనం కనిపించింది. వెండి ధర 1190 రూపాయల మేర తగ్గింది. గరిష్ఠ స్తాయికి చేరుకున్న బంగారం ధర.. ఎక్కువ రోజులు అదే రేట్లపై స్థిరంగా కొనసాగలేకపోయింది. 57 వేలకు పైగా నమోదు చేసిన తరువాత.. క్షీణత చోటు చేసుకుంది.

అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు..

అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు..

ప్రతిరోజూ వాటి ధరలు తగ్గుముఖం పడుతూనే వచ్చాయి. కొంతకాలంగా అంతర్జాతీయ విపణిలో డాలర్ విలువ పెరుగుతోంది. దీన్ని బలోపేతం చేయడానికి అమెరికా ప్రభుత్వం చైనాతో వాణిజ్యపరమైన సంప్రదింపులను నిర్వహించడం ఓ కారణమని విశ్లేషిస్తున్నారు. ఆసియా దేశాల్లో ఆర్థికంగా అత్యంత బలమైన శక్తిగా ఆవిర్భవించిన చైనాతో సత్సంబంధాలను కొనసాగించడం వల్ల వాణిజ్యపరంగా లబ్ది పొందుతామనే అభిప్రాయం అమెరికా ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది.

 హైదరాబాద్‌లో గ్రాము బంగారం ధర..

హైదరాబాద్‌లో గ్రాము బంగారం ధర..


అమెరికా, చైనా మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్ల క్షీణతకు ఓ కారణమని అంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాలు బంగారం ధరలను నియంత్రిస్తున్నాయని చెబుతున్నారు. హైదరాాబాద్‌లో గ్రాము బంగారం ధర 5,406 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 5406 రూపాయలుగా, 22 క్యారెట్ల పసిడి 4949గా నమోదైంది. మంగళవారం నాటి ధరతో పోల్చుకుంటే ఈ రెండు క్యారెట్ల ధరల్లో ఒక రూపాయి మేర పెరుగుదల కనిపించింది. విజయవాడలో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర అదే స్థాయిలో నమోదవుతోంది.

ఈ మూడు నగరాల్లో ఒకే రేటు..

ఈ మూడు నగరాల్లో ఒకే రేటు..


ఒక గ్రాము 22 క్యారెట్ల ధర విజయవాడ, విశాఖపట్నంలల్లో 4949 రూపాయలుగా నమోదైంది. ఈ రెండు నగరాల్లో కూడా 24 క్యారెట్ల ధర హైదరాబాద్‌తో సమానంగా రికార్డు అయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము ఒక్కింటికి 5406గా నమోదైంది. ఇదివరకు నమోదైన బంగారం రేట్లను పరిగణనలోకి తీసుకుంటే.. మున్ముందు మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 50 వేలకు దిగువ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నాయి.

English summary
Gold and silver prices on Wednesday have seen a continuous fall in domestic markets in India. The price of yellow have been affected due to the US China business deals and strengthening of US dollar. On MCX, Gold futures have been decreased by Rs. 370 at Rs. 53,300.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X