షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలిలా!!
బంగారం ధరలు రోజురోజుకీ దూకుడును కొనసాగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పైకే చూస్తున్న బంగారం ధరలు నేడు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో కొత్త సంవత్సరం, సంక్రాంతికి బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకునేవారు బంగారం కొనుగోలు చెయ్యలేని పరిస్థితికి వెళ్ళారు. ఇక తాజాగా నేడు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దేశీయంగా నేడు బంగారం ధరల విషయానికి వస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,500 రూపాయలుగా ఉంది. ఈ ధర నిన్న 58,400 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు 63,820రూపాయలుగా ఉంది . ఈ ధర నిన్న 63,710 రూపాయలుగా ఉంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 100 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 110 రూపాయల మేర ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,650 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,960 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు 63,820 రూపాయలు కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,500 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,500 రూపాయలుగా ఉంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,820 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,500 రూపాయలుగా ఉంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,820 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ రోజు వెండి ధరలు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది. నేడు వెండి ధర 300రూపాయల తగ్గుదల నమోదు చేసినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications