ఏపీకి శుభవార్త... త్వరలోనే అక్కడ సీ ప్లేన్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి. ఇక ఏపీకి విమానయాన శాఖ మంత్రి ఉండడంతో విమాన రంగంలోనూ ఏపీలో కీలకంగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర పౌర విమానా శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు.
ఏపీలో త్వరలో సీ ప్లేన్ విధానం
ఏపీలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించిన తరువాత రామ్మోహన్ నాయుడు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే వారంరోజుల్లో సీ ప్లేన్ విధానాన్ని విడుదల చేస్తామని పేర్కొన్న ఆయన ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలంలో ఎయిర్ డ్రోమ్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి ఏపీ ప్రభుత్వం అంగీకరించిందన్న ఆయన సీ ప్లేన్ విధానాన్ని ఏపీ అద్భుతంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

సీ ప్లేన్స్ తో పర్యాటకంగా ఏపీలో ప్రగతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సీ ప్లేన్లు ఎంతో బాగా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గాలిలో ఎగర గలిగే, నీటిపై తేలగలిగే, ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్న ఈ సీ ప్లేన్స్ అమెరికా, మాల్దీవులు వంటి దేశాలలో పర్యాటకంగా అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరప్రాంతం అధికంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా ఏపీకి ఇది బాగా ఉపయోగపడుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
సీ ప్లేన్స్ తో చాలా ఉపయోగాలు
ఈ విమానాలు పర్యాటకంగానే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, ఏవైనా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రంసీ ప్లేన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే దానిని ఏపీలో అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై చర్చ జరిగిందని సీఎం ప్రతిపాదనకు వెంటనే అంగీకారం తెలిపినట్టు సమాచారం.
నూతన సి ప్లైన్ (Sea-Plane) విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న జలవనరులను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో నూతన వాటర్ ఏరోడ్రోమ్ లను నిర్మిస్తాం. తద్వారా మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) August 18, 2024
The Upcoming new Sea-Plane policy will… pic.twitter.com/WoYcyWXBgu
ఆ జిల్లాలలోనే సీ ప్లేన్స్
ఇక చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు ప్లాన్ వర్క్ అవుట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలంలో త్వరలోనే సీ ప్లేన్ లను చూసే అవకాశం తో పాటు, వాటిలో తిరిగే అవకాశం కూడా దక్కుతుంది. మొత్తానికి ఏపీలో విమానయాన రంగంలో వీలైనంత ప్రగతిని సాధించేందుకు కింజారపు రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు సూచనలతో బాగానే కష్టపడుతున్నాడు.












Click it and Unblock the Notifications