ఏపీలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి భారీ శుభవార్త
ఏపీలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వారికి బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు.
ఏపీలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బియ్యం(రేషన్) కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి పెళ్లి కార్డు అడగటం అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు అవసరం లేదని ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
అయితే భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటినట్లయితే సింగిల్ మెంబర్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో నెలకున్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారి కోసం గడువును పెంచే యోచనలో ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు జనాలు క్యూ కట్టారు. ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. అయితే కొత్త రేషన్‌కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ తప్పనిసరి చేయడంతో పాటు గిరిజనుల్లో 80 శాతం మంది వివాహితులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ జరగలేదు. దీంతో మాన్యం జిల్లాతోపాటు పలు ఏజెన్సీ ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications