ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి క్యాబినెట్ ఆమోదం

ఏపీఎస్ ఆర్టీసీ కి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం . నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని ఆదుకోటానికి నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ నేడు ఏపీ క్యాబినెట్ భేటీలో ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికపై చర్చ జరిపింది. ఆర్టీసీని విలీనం చెయ్యాలన్న అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా ప్రకటించి ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.

విలీనంలో భాగంగా సంస్ధ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకునే అంశంపై మంత్రివర్గ భేటీలో క్లారిటీ వచ్చిందని మంత్రి పేరని నానీ ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఏర్పాటైన ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీని రవాణాశాఖలో విలీనానికి ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారని ప్రకటించారు. 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను పబ్లిక్‌ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకుంటారని పేర్కొన్నారు.

Good news for RTC workers ... Government approves RTC merger

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని , మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు. బస్ చార్జీల నియంత్రణ మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపామని బస్ చార్జీల విషయంలో స్వయం ప్రతిపత్తి కలిగిన నియంత్రణా మండలిని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక ఈ విలీనంతో ఆర్టీసీకి సంబంధించిన రూ.3300 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం మోయనుందని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+