ప్రయాణికులకు గుడ్‌న్యూస్... సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆ స్టేషన్ వరకు పొడిగింపు..
ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ అధికారులు ఓ శుభవార్తను అందించారు. ఎట్టకేలకు యానాం ప్రజల కోరిక నెరవేరింది. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించాలని గత కొంతకాలంగా యానాం ప్రజలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పడు వారి కోరిక నెరవేరబోతుంది. యానం ప్రజల కోరిక మేరకు వారి సౌకర్యార్థం సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను పొడిగించడం జరిగింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో యానాం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ సర్కారు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గతంలో కాకినాడ పోర్టు నుంచి చెన్నై మీదుగా చెంగల్‌పట్టు వరకు వెళ్లేది. ఇప్పడు ఈ ట్రైన్‌ని పుదుచ్చేరి వరకు వెళ్లనుంది. కాకినాడ పోర్టు నుంచి చెన్నై మీదుగా చెంగల్‌పట్టు వరకు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇక నుంచి పుదుచ్చేరి వరకు పొడిగించనున్నారు.
కాకినాడ-చెంగల్పట్టు-కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి పుదుచ్చేరి స్టేషన్ వరకు నడవనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. రైల్వేశాఖ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకనుంచి సర్కారు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించనుంది. దీంతో సామర్లకోట పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైలు ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది. అయితే, ఈ సర్కారు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వారంలో మూడు రోజులు మాత్రమే పుదుచ్చేరి స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది.

వారంలో మూడు రోజులు మాత్రమే..
17644 నంబరు కాకినాడ-చెంగల్పట్టు మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కాకినాడ-పుదుచ్చేరి మధ్య ఆదివారం, బుధవారం, గురువారం రోజుల్లో మాత్రమే నడుస్తోంది. మిగిలిన నాలుగు రోజుల అంటే సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలలో కాకినాడ-చెంగల్పట్టు మధ్య మాత్రమే ఈ ట్రైన్ ప్రయాణించనుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించగలరని అధికారులు సూచించారు. ఈ క్రమంలో పొడిగించిన సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గురువారం నాడు పుదుచ్చేరీ మీదుగా ప్రారంభమైంది. మార్చి 15న అంటే నేడు కాకినాడ-చెంగల్పట్టు మధ్య, మార్చి 16న చెంగల్పట్టు-కాకినాడ మద్య పొడిగించిన రైళ్లు ప్రారంభం అవుతాయి. ఇక, వారంలో మూడు రోజులు అంటే సోమవారం, గురువారం, శుక్రవాారాల్లో 17651 నంబరు గల చెంగల్పట్టు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పుదుచ్చేరి నుంచి కాచిగూడ వరకూ నడవనుంది. ప్రయాణికులు ఇతర వివరాల కోసం సమీప రైల్వే స్టేషన్‌లో బుకింగ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications