విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రజలకు ముఖ్య గమనిక
వేసవిలో రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. విశాఖ-ఎస్ఎంవీ బెంగళూరు (08549) ప్రత్యేక రైలు ఈ నెల 27 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. తర్వాతరోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అలాగే ఎస్‌ఎంవీ బెంగళూరు-విశాఖ(08550) ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటలకు బెంగళూరులో బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 9.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రైలు దువ్వాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. తిరుపతి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు మరో రైలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. రేణిగుంటలో స్టాప్ ఉండటంతో అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు.

వేసవికి ప్రత్యేక రైళ్లను అధిక సంఖ్యలో నడుపుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది వేసవిలో 6369 ట్రిప్పులు నడపగా దాన్ని 9111 కు పెంచారు. అలాగే ప్రధాన రైలు మార్గాల్లో 2472 ట్రిప్పులు పెంచారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1012 ట్రిప్పులు నడవనున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిలనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ వేసవి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో చేపట్టారు. విశాఖపట్నం జోన్ పరిధిలో 649 కిలోమీటర్ల ట్రాక్ ను పునరుద్ధరించారు. వేసవి రైళ్లు ఏప్రిల్, మే నెలల్లో 1079 ట్రిప్పులు అందుబాటులో ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications