ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. 7900 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న మంత్రి

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను కల్పించిన వైసీపీ సర్కార్ మరో నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేసుకుంది. ఏపీలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటానికి కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మరో మారు నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్ ఇవ్వనుంది అన్న విషయాన్ని అసెంబ్లీ వేదికగా వెల్లడించింది.

 2020 జనవరిలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ

2020 జనవరిలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ

జగన్ సీఎంగా వచ్చిన నాటి నుండి నిరుద్యోగం తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలు, విడుదల చేస్తున్న నోటిఫికేషన్లతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇక మరో నోటిఫికేషన్ త్వరలో ఇవ్వనున్నామని పేర్కొన్నారు ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ .2020 జనవరిలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రకటించారు . వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు.. వచ్చే నెలలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు జనవరి పండుగ ..

నిరుద్యోగులకు జనవరి పండుగ ..

మొత్తం 7900 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు మంత్రి . అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మరో పండగే కదా మరి. మొత్తానికి చూస్తే డీఎస్సీ కోసం ఇన్ని రోజులుగా వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తేనని చెప్పుకోవచ్చు.ఇప్పటికే జనవరి నెలలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం . ఏపీ సర్కార్ జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. 44,941 పోస్టుల భర్తీకి ఈ దఫా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది.

అన్ని శాఖల్లోనూ ఉద్యోగాలు .. వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

అన్ని శాఖల్లోనూ ఉద్యోగాలు .. వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు శాఖల వారీగా చూస్తే పోలీస్ డిపార్ట్ మెంట్ లో 13,591 పోస్టులు, డి.ఎస్సి లో 20,000 పోస్టులు, గ్రూప్-2 లో 1000 పోస్టులు, గ్రూప్-4 లో 2,600 పోస్టులు, అటవీ శాఖలో 2,750 పోస్టులు ఇతరులు 5000 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక వీటితో పాటు తాజాగా జనవరిలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండటం నిజంగా నిరుద్యోగులకు శుభ సూచకమే .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+