తెలుగు రాష్ట్రాలకు రైల్వే శుభవార్త.. త్వరలో బుల్లెట్ రైళ్ళు రయ్ రయ్!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి బుల్లెట్ రైలు సేవలను విస్తరించే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, బెంగళూరు లకు రెండు వేరు వేరు హై స్పీడ్ రైలు కారిడార్ లకు సంబంధించి తుది సర్వే పనులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నుండి బుల్లెట్ రైలు
ఈ బుల్లెట్ రైలు మార్గాలను గంటకు గరిష్టంగా 350 కి.మీ, సగటున 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా రూపొందిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలను కలుపుతూ సాగే హైదరాబాద్ ముంబై హై స్పీడ్ కారిడార్ డి పి ఆర్ ప్రకారం మొత్తం 11 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 170 కిలోమీటర్ల పరిధిలో ఈ కారిడార్ ఉంటుంది. రాష్ట్రంలో జహీరాబాద్, హైదరాబాద్ రెండు స్టేషన్లు ఉంటాయి.

కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందితే పనులు షురూ
కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్స్ ఎఫైర్స్ ఆమోదం పొందిన తర్వాత భూసేకరణ నిధుల మంజూరు వంటి ప్రక్రియలు మొదలవుతాయి. చెన్నై బెంగళూరు మార్గాలను కూడా కలిపితే మన రాష్ట్రంలో హై స్పీడ్ కారిడార్ 580 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ ముంబై హై స్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా, చెన్నై బెంగళూరు హైస్పీడ్ కారిడార్ల తుది సర్వేపనులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అభిప్రాయాల సేకరణ
రైల్వే అనుబంధ సంస్థ రైట్స్ దీనికి సంబంధించి ప్రాథమికంగా అలైన్మెంట్ లను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత వీటిని ఖరారు చేస్తారు. దీనికి సంబంధించి సర్వే అధికారులు ఇప్పటికే తెలంగాణ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ ప్రతిపాదనల పైన చర్చించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి కాజీపేట నల్గొండ మీదుగా రెండు పాత రైల్వే మార్గాలు, విజయవాడ హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి 65కూడా అందుబాటులో ఉన్నట్టుగా గుర్తించారు.
మూడు మార్గాలలో హై స్పీడ్ కారిడార్
ఇక ఈ మూడు మార్గాలలో హై స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా చర్చలు చేశారని కాజీపేట మీదుగా అయితే దూరం ఎక్కువ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అయిందని సమాచారం. ఇక ఈ రైల్వే కారిడార్ కు ఎన్ హెచ్ 65 వెంటనే, నల్గొండ మీదుగా గాని రెండు మార్గాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మూడు గంటల్లోనే ముఖ్య నగరాలకు
ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకు బెంగళూరుకు రైలులో ప్రయాణం చేస్తే సమయం సుమారు 12 నుంచి 13 గంటలు పడుతుంది. ఈ నగరాలను మూడు గంటల్లోనే చేరుకునే లాగా బుల్లెట్ రైల్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన రైల్వే
హై స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ను పాత వాటితో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్ ఫీల్డ్ నమూనాలో నిర్మిస్తారు.ఈ మార్గంలో కేవలం బుల్లెట్ రైలు మాత్రమే నడుస్తాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన రైల్వే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలుమార్గాన్ని కాకుండా చెన్నై బెంగళూరు హై స్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్ట్ లతో ప్రయాణం సులభం
ఈ మూడు ప్రాజెక్టులు వస్తే హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా ప్రయాణం మరింత సులభం అవుతుంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications