Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళలను లక్షాధికారులు చేసే శుభవార్త.. 5లక్షలు వడ్డీలేని రుణాలు!

భారత ప్రధాని నరేంద్ర మోడీ మహిళల ఆర్థిక స్వావలంబనకు లఖ్ పతి దీదీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్రలోని జల్గావ్ లో నేడు జరిగిన లఖ్ పతి దీదీ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో లఖ్ పతి దీదీ హోదాను సాధించిన 11 లక్షల మందికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

లఖ్ పతి దీదీ పథకం పై మోడీ ప్రకటన
అంతేకాదు 2500 కోట్ల నిధిని కూడా ప్రకటించి 48 లక్షల మంది సభ్యులతో ఉన్న 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం చేకూర్చేందుకు మోడీ ప్రకటన చేశారు.లఖ్ పతి దీదీ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు కోటి మంది మహిళలు ఈ కోవలో చేరారని మూడు కోట్ల మందిని సృష్టించడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు.

good news of making women millionaires 5 lakh interest free loans With lakhpathi didi scheme

మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు లఖ్ పతి దీదీ పథకం
లఖ్ పతి దీదీ పథకం ద్వారా మహిళలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, నైపుణ్య శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఉపాధి కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందించడానికి అమలు చేస్తున్న పథకమే లఖ్ పతి దీదీ పథకం. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, స్వయం ఉపాధి కల్పించుకునేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

ఐదు లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు
లఖ్ పతి దీదీ యోజన పథకం కింద స్వయం సహాయక బృందాలలోని మహిళలకు ఐదు లక్షల వరకు రుణాలను ఇచ్చి, వారి ఆర్థిక పురోగతికి బాసటగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల రుణాలకు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను అందించి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

లఖ్ పతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోండిలా
లఖ్ పతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలిగా ఉండడంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు కలిగి ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని, బ్యాంకు పాస్బుక్ ను, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను ఇచ్చి మీరు చేయదలుచుకున్న వ్యాపారానికి సంబంధించి వివరాలను జోడించి దరఖాస్తు చేసుకోవచ్చు.

మహిళలు లక్షాధికారులై ఉండాలి
ఈ పథకంలో మహిళలు సున్నా వడ్డీతోనే 5 లక్షల రూపాయల రుణాన్ని పొందుతారు. మరెందుకు ఆలస్యం.. ఆర్థికంగా ఎదగాలనుకుంటున్న మహిళలు తక్షణం భారత ప్రభుత్వం అందిస్తున్న లఖ్ పతి దీదీ పథకంలో ఐదు లక్షల రూపాయల రుణాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+