సికింద్రాబాద్, విశాఖ మధ్య ప్రత్యేక రైళ్ళు .. ఫెస్టివల్ స్పెషల్!
ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రైల్వేను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్టు ప్రకటించింది.
క్రిస్మస్ పండుగ ప్రత్యేక రైళ్ళు
డిసెంబర్ మాసంలో రానున్న క్రిస్మస్ పండుగకు, అలాగే వచ్చే నెలలో సంక్రాంతి పండుగలకు ప్రజలు సొంత ఊర్లకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇదే క్రమంలో ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా క్రిస్మస్ పండుగ కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది .

రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్గాల్లో ప్రత్యేక రైళ్ళు
ప్రయాణికుల రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన సేవలను అందించడానికి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే క్రిస్మస్ పండుగ కోసం ప్రకటించిన ఈ ప్రత్యేక రైళ్ళు డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబరు 30వ తేదీ వరకు రాకపోకలు సాగించనున్నాయి.
సికింద్రాబాద్ నుండి విశాఖకు రైళ్ళు
ఇక వాటి వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం ట్రైన్ నెంబర్ 07097 డిసెంబర్ 8, 15, 22, 29 తేదీలలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6: 30 నిమిషాలకు విశాఖపట్నం కి చేరుకుంటుంది.
బ్రహ్మపూర్ నుండి సికింద్రాబాద్ కు
అలాగే విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్ నెంబర్ 07098 డిసెంబర్ 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక 07028 బ్రహ్మపూర్ నుంచి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 7, 14, 21 మరియు 28 తేదీలలో బ్రహ్మపూర్ నుండి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
ఏపీ, తెలంగాణాలో ఈ రైళ్ళు ఆగే స్టేషన్లు ఇవే
ఇక ఈ ప్రత్యేక రైళ్ళు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపద, పలాస, సోంపేట మరియు ఇచ్చాపురం స్టేషన్లలో ఆగుతాయి. ఇక ఈ మార్గంలో ప్రయాణం చేసే వారికి ఈ ప్రత్యేక రైళ్ళు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాయి.












Click it and Unblock the Notifications