Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుడ్ న్యూస్.. విశాఖలో 30 వేల మందికి ఉపాధినిచ్చే బిగ్గెస్ట్ గ్లోబల్ టాయ్ పార్క్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా విశాఖను పారిశ్రామిక హబ్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కార్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ వివిధ భారీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను ఇస్తూ పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుంది. తద్వారా స్థానికంగా ఉద్యోగాల కల్పనకు, ఆ ప్రాంత ఆర్థిక ఉన్నతికి దోహదం చేస్తుంది.

ఎక్స్పోర్ట్ ఆధారిత బొమ్మల తయారీ కేంద్రంగా మార్చే ప్రాజెక్ట్
ఇదే క్రమంలో తాజాగా ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి లో పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్ ను స్థాపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక, చి. లక్ష్మీపురం గ్రామాలలో ఈ టాయ్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ 581 . 39 ఎకరాల భూమిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్స్పోర్ట్ ఆధారిత బొమ్మల తయారీ కేంద్రంగా మార్చడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.

Good news The biggest global toy park in Visakhapatnam will provide employment to 30 thousand people

Take a Poll

నక్కపల్లి కేంద్రంగా టాయ్ పార్క్
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సిస్టం ని బేస్ చేసుకుని భారతదేశాన్ని బొమ్మల తయారీలో కీలక పాత్రధారిగా మార్చే కేంద్ర ప్రభుత్వ జాతీయ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును విశాఖలోని నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం భూసేకరణకు ప్రభుత్వం 2025 నవంబర్ 16వ తేదీన జీవో. 223 ను జారీ చేసింది.

పాల్స్ గ్లోబల్ తో ప్రభుత్వ భాగస్వామ్యం
ప్రపంచ స్థాయి టాయ్ తయారీ ఎకో సిస్టం అభివృద్ధి చేయడానికి ఏపీ సర్కార్ మరొక కీలక అడుగున ముందుకు వేసింది. పాల్స్ గ్లోబల్ భాగస్వామ్యంతో ఏపీఐఐసీ గ్లోబల్ టాయ్ పార్క్ ను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. బొమ్మల తయారీలో అంతర్జాతీయ పెట్టుబడిదారులతో ఏపీఐఐసీ సహకారాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ బొమ్మల తయారీలో ప్రముఖ సంస్థ అయిన పాల్స్ గ్లోబల్ తో ప్రభుత్వం ఈ మేరకు భాగస్వామ్యం చేసుకుంది.

గ్లోబల్ టాయ్ పరిశ్రమ ఇన్వెస్టర్స్ ను కలిసిన చంద్రబాబు
జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాల ప్రముఖు గ్లోబల్ టాయ్ పరిశ్రమ పెట్టుబడిదారులతో పాటు పాల్స్ ప్లస్ లిమిటెడ్ అధ్యక్షుడు అజయ్ సిన్హాను ఈ మేరకు కలిసినట్టు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం లో పర్యావరణ అనుకూల టాయ్ పార్క్ అభివృద్ధి అంశంపై చర్చించినట్లు ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

౩౦ వేల మందికి పైగా మహిళలకు ఉపాధి
ఈ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలోని 30 వేల మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు ఆనందాన్ని కలిగించే ఉత్పత్తులు ఇక్కడి నుంచి తయారవుతాయని చంద్రబాబు తను చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.

విశాఖపట్నం ను ప్రపంచ బొమ్మల తయారీ కేంద్రంగా
ఈ టాయ్ పార్క్ పెట్టుబడిదారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, విశాఖపట్నం ను ప్రపంచ బొమ్మల తయారీ కేంద్రంగా నిలబెడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాయ్ పార్క్ nh16 రోడ్డు మార్గంలో, విమానాశ్రయానికి, ఓడరేవు మరియు రైలు నెట్వర్క్ తో అనుసంధానం చేయబడి, మంచి రవాణా వ్యవస్థతో పక్కా ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయబడుతుంది. బొమ్మల తయారీ కోసం ఇది ఒక ప్రత్యేకంగా రూపొందించబడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+