తిరుపతికి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్న చంద్రబాబు.. కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అంతర్జాతీయంగా ఏపీకి గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్న చంద్రబాబు ఆ దిశగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు దానిని కార్యరూపం లోకి తెస్తున్నారు.
తిరుపతి స్పోర్ట్స్ సిటీకి భూ కేటాయింపు
తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు భూమి కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్ర క్రీడారంగ అభివృద్ధి పరుగులు పెడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తిరుపతి అంతర్జాతీయ ఖ్యాతిగల పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా, విద్య వైద్య పర్యాటక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అటువంటి చోట స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుతో మరింత గుర్తింపు తీసుకురావాలని చంద్రబాబు సంకల్పించారు.

జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ
ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలను అందులో నిర్వహించేలా అందుకు తగినట్టుగా నిర్మాణం చేపట్టనున్నారు. దామినేడు గ్రామంలో 28.37 ఎకరాలలో కేటాయించిన భూమిలో క్రికెట్ స్టేడియం, అథ్లెటిక్స్ ట్రాక్ , ఇండోర్ స్టేడియం, హాకీ, ఫుట్ బాల్ మైదానాలు, స్విమ్మింగ్ పూల్ వంటి క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా స్పోర్ట్స్ సిటీ
క్రీడాకారుల కోసం హాస్టల్స్, కోచింగ్ అకాడమీలు, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్లు, జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ స్పోర్ట్స్ సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావడానికి బలమైన వేదికగా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.
హామీ నెరవేర్చే పనిలో చంద్రబాబు
స్పోర్ట్స్ సిటీ ద్వారా తిరుపతిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం తిరుపతిలో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ సిటీకి భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే నిర్మాణాలను చేపట్టి క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా చంద్రబాబు అడుగు వేయనున్నారు.
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications