ఏపీ ప్రజలకు అన్నా క్యాంటీన్ లపై కడుపు నిండే వార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏపీలోని పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తూ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రవ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు వెల్లడించారు.
తిరుమలలో శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ
ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కి వెళ్ళిన మంత్రి నారాయణ విఐపి విరామ సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేదఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన నారాయణ అన్న క్యాంటీన్ ల పైన శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని మంత్రి నారాయణ వెల్లడించారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వంద అన్నా క్యాంటీన్ లు
సీఎం చంద్రబాబు సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మంత్రులందరం కృషి చేస్తున్నామని నారాయణ పేర్కొన్నారు .రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను గురించి మాట్లాడిన నారాయణ ఇప్పటికే రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
మరో 75 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
సెప్టెంబర్ 13వ తేదీన మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. అన్న క్యాంటీన్ల ద్వారా ఉదయం 7:30 గంటల నుండి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12:30 గంటల నుండి మూడు గంటల వరకు భోజనం, రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు రాత్రి భోజనం అయిదు రూపాయలకే అందిస్తున్నారు.
సెప్టెంబర్ 13న అన్నా క్యాంటీన్ ల ప్రారంభం
ఆదివారం మినహా వారంలో అన్ని రోజులు అన్నా క్యాంటీన్ లు రాష్ట్రంలో పేద ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఇదే క్రమంలో మళ్లీ సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications