తిరుపతికి విమానంలో ప్రయాణం కేవలం రూ.1499.. త్వరపడండి!

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుకోని వారు ఉండరు. తిరుమల వెళ్లాలని, వెంకన్న దర్శనం చేసుకోవాలని వివిధ రవాణా మార్గాల ద్వారా ప్రయాణం చేసి స్వామి దర్శనం చేసుకునే భక్తులు మరింత మెరుగైన ప్రయాణం కోసం చూస్తూ ఉంటారు. అటువంటి వారికి శుభవార్త చెప్పింది అలయన్స్ ఎయిర్ లైన్స్.

తిరుమల శ్రీవారి భక్తులకు మరో విమాన సర్వీస్ అందుబాటులో
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం మరో విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తూ శుభవార్త చెప్పింది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి రాజమహేంద్రవరం తిరుపతి మధ్య ఈ కొత్త విమాన సర్వీస్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అలయన్స్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. అక్టోబర్ 2, 4, 6 తేదీలలో తిరుపతి నుండి రాజమహేంద్రవరం విమాన టికెట్ ధర కేవలం 1499 రూపాయలుగా నిర్ణయించారు.

good news to tirumala devotees new flight service to tirupati with just 1499 rupees from rajamahendravaram

Take a Poll

విమాన టికెట్ కేవలం 1499 రూపాయలకే
అంతకుముందు ఈ టికెట్ ధర 1999 రూపాయలుగా ఉండగా, తిరుమలకు వెళ్లే భక్తులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ టికెట్ ధరలు తగ్గించినట్లు అలయన్స్ విమాన సంస్థ రాజమహేంద్రవరం మేనేజర్ వెల్లడించారు. 1499 రూపాయలకే విమానంలో ప్రయాణం చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు అని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

తిరుపతికి కొత్త సర్వీస్ పైన శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు ఇది చాలా సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని, తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో శ్రీవారిని దర్శించుకోవచ్చు అని అలయన్స్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. ఇక అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రాజమహేంద్రవరం తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానాలు వారంలో మూడు రోజులు నడుస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కొత్త సర్వీస్ పైన శుభవార్త చెప్పారు.

వారంలో మూడు రోజులు విమాన సర్వీస్
మొదటి రోజు అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం 9 గంటల 25 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి విమానం రాజమహేంద్రవరం కు చేరుకుంటుందని, మళ్లీ తిరుగు ప్రయాణం 10 గంటల 15 నిమిషాలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+