సిగ్గూలజ్జా లేని ఏ2రెడ్డి; అది నోరా.. డ్రైనేజీనా: సాయిరెడ్డిపై విరుచుకుపడిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి
తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మధ్య సోషల్ మీడియాలో ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రివర్స్ ఎటాక్ ఇస్తున్నారు. అది నోరా డ్రైనేజ్ నా అంటూ సాయిరెడ్డి పై మండి పడుతున్నారు.

మీలాంటి పేటియం కుక్కలు కక్కుర్తి పడి మార్ఫింగ్ చేసిన ఫోటో అది.. సాయిరెడ్డికి గోరంట్ల కౌంటర్
తాజాగా మహిళను ఈడ్చికొట్టావు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని టార్గెట్ చేసి ఓ ఫోటోను పోస్ట్ చేసే రచ్చ చేసిన విజయసాయిరెడ్డి పై మండిపడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అది మార్ఫింగ్ ఫోటో అని తేల్చి చెప్పారు. నువ్వు జైల్ లో ఉన్నపుడు జరిగినవి నిజాలు అనుకుంటే ఎలా 'పిచ్చి' రెడ్డి అంటూ ప్రశ్నించారు. అందుకే నిన్ను సిగ్గు లజ్జ లేని A2రెడ్డి అన్నారు అని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పోరంబోకు గారు మీకు విషయం తెలీదు అనుకుంటా.. మీలాంటి పేటియం కుక్కలు కక్కుర్తి పడి మార్ఫింగ్ చేసిన ఫోటో అది అంటూ తన పై విజయ సాయి రెడ్డి పోస్ట్ చేసిన ఫోటో మార్ఫింగ్ ఫోటో అని పేర్కొన్నారు.

ఒరిజినల్ ఫోటో ఇలా ఉంటుందని సాయిరెడ్డి, జగన్ లు జైలు నుండి వచ్చే ఫోటోలు
ఇక కక్కుర్తి ఎలా ఉంటుందంటే విజయసాయిరెడ్డి 5రూపాయలకి కక్కుర్తి పడతాడు అంటూ పేర్కొన్నారు.. ఇక విజయసాయిరెడ్డిని 'పిచ్చి'రెడ్డి గా అభివర్ణించారు. ఇదే సమయంలో ఒరిజినల్ ఫొటో అంటే ఇలా ఉండాలి 'పిచ్చి' రెడ్డి అని పేర్కొన్న గోరంట్ల జైలు నుండి బయటకు వస్తున్న విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ల ఫోటోలు ట్వీట్ చేశారు. పేటియం కార్మికులు మార్చిన ఫొటో పెట్టి యాగీ చేయడం కాదు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

కొన్ని దిక్కుమాలిన బ్రతుకులు అంతే
విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని అసహనం వ్యక్తం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అది నోరా లేక డ్రైనేజీనా అంటూ ప్రశ్నించారు. కొన్ని దిక్కుమాలిన బ్రతుకులు అంతే అంటూ విరుచుకుపడ్డారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో సాయి రెడ్డి తీరు పైన కూడా సెటైర్లు వేశారు. ఊరంతా వడ్లు ఎండ బెట్టుకుంటే నక్క తోక ఎండ బెట్టుకుంది అంట అలా ఉంది మిస్టర్ బ్రోకర్ వీసా రెడ్డి ని యవ్వారం అంటూ పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ లో నువ్వు చేసింది ఏంటి బ్రోకర్ సాయి అంటూ ప్రశ్నించారు.

రాత్రి లీకేజీ చేయడం.. పొద్దున ఏమీ తెలియనట్టు పడుకోవటం అంటూ సాయిరెడ్డి ఫోటో ట్వీట్
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 20మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు అని విమర్శించారు. దాదాపు 500 మంది అభాగ్యులు అయ్యారు.ఇప్పటికి వారికి పరిహారం లేదని బుచ్చయ్య చౌదరి విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేశారు. ఇక రాత్రి లీకేజీ చేయడం.. పొద్దున ఏమీ తెలియనట్టు అక్కడ పడుకోవడం అంటూ విజయసాయిరెడ్డి పడుకున్న ఒక ఫోటోను పోస్ట్ చేసి ఛీ పాడు బ్రతుకులు అంటూ టార్గెట్ చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications