బీసీ రిజర్వేషన్ల రచ్చ: చంద్రబాబును టార్గెట్ చేసినమాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

రిజ‌ర్వేష‌న్లు 24శాతానికి త‌గ్గ‌డానికి చంద్ర‌బాబే కార‌ణం అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ప్ర‌కాశం జిల్లా కొండ‌పిలో జ‌రిగిన స‌భ‌లో బీసీల రిజర్వేషన్ల అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పచ్చి అబద్ధాలతో బురదజల్లే ప్ర‌య‌త్నం చేశాడ‌ని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆ తర్వాత వైఎస్‌ జగన్ గారి ప్రభుత్వాల‌దేనని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు తన మనిషి బిర్రు ప్రతాప్‌రెడ్డి తో కోర్టులో పిటిషన్‌ వేయించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని, ఫలితంగా రిజర్వేషన్లు 24.15 శాతానికి పరిమితమయ్యాయని ఆరోపించారు.

BC Reservations: ఆ సీట్లు బీసీలకే, స్థానిక పోరులో చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్!
BC Reservations: ఆ సీట్లు బీసీలకే, స్థానిక పోరులో చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్!
Gorantla Madhav targets ap cm Chandrababu for Dropping Reservations to 24percent slams chandrababu bc politics

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనూ వైఎస్సార్సీపీపై నిందలు వేయడం మానకుండా, బీసీలను ఎన్నికల కోసం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్ట సవరణ చేయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పోలవరంపై బిగ్ అప్ డేట్! కేంద్రంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
పోలవరంపై బిగ్ అప్ డేట్! కేంద్రంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్ర‌చారం చేస్తున్నాడని మండిపడ్డారు. 1995లో తానే 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చానని, వైఎస్సార్సీపీయే వాటిని తగ్గించిందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండగా, ఫిబ్రవరి 3 నాడే ఆ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే, సెప్టెంబర్ 1న సీఎం అయిన చంద్రబాబు ఆ ఘనత తనదే అని చెప్పుకోవడం ఆయనకే చెల్లుతుందన్నారు.

ఆయ‌న జారీ చేసిన జీవో నెం:105, 1065లను హైకోర్టు కొట్టివేస్తే ఆ నెపాన్ని కూడా వైఎస్సార్సీపీ పై నెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు హైకోర్టులో చంద్రబాబు జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది న్యాయవాది తాండవ యోగేష్ స్వయంగా పార్టీ-ఇన్‌-పర్సన్‌గా హాజరై వాదనలు వినిపించారు, దీనికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలని మాత్రమే వైఎస్సార్సీపీ కోర్టును ఆశ్రయించింది తప్ప రిజర్వేషన్లను అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ బీసీల పక్షమే ఉంటుంది కాబట్టి వారికి రాజకీయ, సామాజిక సాధికారత కల్పించింది మా ప్రభుత్వమే. చంద్రబాబుకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన వెంటనే కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+